Walking : వాకింగ్ చేయడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వాకింగ్ వల్ల అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. షుగర్, కొలెస్ట్రాల్, బీపీ కంట్రోల్ అవుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అధిక బరువు తగ్గుతారు. ఇంకా వాకింగ్ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది చాలా తేలిగ్గా చేసే వ్యాయామం. కనుకనే వైద్యులు వాకింగ్ చేయాలని పేషెంట్లకు సూచిస్తుంటారు. వాకింగ్ ను ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. కనుక దీంతో ఎక్కువ ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
అయితే వాకింగ్ చేస్తాం కానీ రోజుకు ఎన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయాలి .. ఎంత దూరం నడవాలి.. అని చాలా మంది సందేహిస్తుంటారు. కానీ దీనికి సైంటిస్టులు ఒక సులభమైన మార్గం చెబుతున్నారు. అదేమిటంటే.. రోజుకు 7000 అడుగులు నడిస్తే చాలు.. బాగా వాకింగ్ చేసినట్లు అవుతుంది. దీంతో మనం వ్యాధుల కారణంగా చనిపోయే అవకాశాలు 70 శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక రోజుకు 7000 అడుగులు నడవాలి.
ఇక 7000 అడుగులను ఎలా లెక్కించాలి ? అంటే అందుకు మీ స్మార్ట్ ఫోన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. స్మార్ట్ ఫోన్‌లో పెడోమీటర్ యాప్ ఇన్‌స్టాల్ చేయాలి. తరువాత మీరు వాకింగ్ చేసేటప్పుడు ఆ యాప్‌ను ఓపెన్ చేసి పెట్టాలి. ఫోన్‌ను మీ పాకెట్‌లో ఉంచాలి. లేదా చేత్తో పట్టుకోవాలి. దీంతో ఆ యాప్ మీరు ఎన్ని అడుగులు నడిచారో చెప్పేస్తుంది. లేదా స్థోమత ఉంది అంటే స్మార్ట్ వాచ్ లు లేదా స్మార్ట్ బ్యాండ్‌లను కొని ధరించవచ్చు. వీటిని ధరిస్తే ఫోన్‌ను వెంట బెట్టుకోవాల్సిన పని ఉండదు. వాటిల్లోనే మనం నడిచే అడుగుల సంఖ్య నమోదు అవుతుంది. తరువాత సులభంగా దాన్ని తెలుసుకోవచ్చు. ఆ వాచ్ లేదా బ్యాండ్‌ను యాప్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేస్తే వాటిల్లో ఉండే డేటా అంతా ఫోన్‌లోకి వచ్చేస్తుంది. దీంతో ఆ డేటాను ఫోన్‌లో స్టోర్ చేయవచ్చు. ఇలా రోజూ వాకింగ్ చేస్తూ డేటాను సేవ్ చేస్తే.. ఫోన్‌లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రోజుకు ఎన్ని అడుగుల దూరం నడుస్తున్నామో సులభంగా తెలిసిపోతుంది. కావాలనుకుంటే అడుగుల సంఖ్యను పెంచడమో.. తగ్గించడమో.. చేసుకోవచ్చు. ఇలా రోజూ మనం 7000 అడుగులను సులభంగా నడవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.