అధిక బరువు, పొట్ట.. రెండూ చాలా మందిని ఇబ్బందులు పెడుతుంటాయి. అయితే అధిక బరువు తగ్గడం వేరు. పొట్టను తగ్గించుకోవడం వేరు. కొందరు ఉండాల్సిన బరువే ఉంటారు. శరీరం మొత్తం సాధారణంగానే ఉంటుంది. కానీ పొట్ట మాత్రం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారితోపాటు అధికంగా బరువు ఉన్న వారు కింద తెలిపిన వ్యాయామాన్ని రోజూ చేస్తే పొట్టను, అధిక బరువును తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
మీకు దండీలు అంటే తెలిసే ఉంటుంది. ఇంగ్లిష్‌లో పుషప్స్ అంటారు. వీటిని రోజూ తీయడం వల్ల పొట్టను తగ్గించుకోవచ్చు. అధిక బరువు కూడా తగ్గుతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. రెండు సమస్యలు తగ్గుతాయి.
దండీలు తీయడం సులభమే. దీన్ని రోజూ క్రమం తప్పకుండా చేయాలి. ఆరంభంలో కనీసం 50 దండీలతో మొదలు పెట్టాలి. క్రమంగా, సౌకర్యానికి అనుగుణంగా రోజూ చేసే దండీల సంఖ్యను పెంచుతూ పోవాలి. ఓ దశలో రోజుకు 100 నుంచి 300 వరకు దండీలను వేగంగా తీయవచ్చు. ఇలా అలవాటు చేసుకోవాలి.
ఈ వ్యాయామాన్ని ఇంట్లోనే సులభంగా చేయవచ్చు. ఉదయాన్నే కాలకృత్యాలను తీర్చుకున్నాక ఈ వ్యాయామం చేయాలి. ఆరంభంలో కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ రోజూ చేస్తే అలవాటు అవుతుంది. ఈ క్రమంలో రోజూ ఈ వ్యాయామాన్ని చేయడం వల్ల పొట్ట తగ్గుతుంది. అధిక బరువు తగ్గుతారు.
దండీలను తీయడం కోసం పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. కష్టం అవుతుందనుకుంటే రోజుకు కనీసం 20 దండీలతో కూడా మొదలు పెట్టవచ్చు. కానీ క్రమంగా అలవాటు అవుతుంది. దీంతో పొట్టను కరిగించవచ్చు.