Skipping : రకరకాల వ్యాయామాలపై దృష్టి సారిస్తూ కొందరు తమ శరీర సౌష్టవాన్ని సంరక్షించుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం రోజూ ఒకే వ్యాయామాన్ని అనుసరిస్తూ తమ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటున్నారు. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరం మొత్తానికి ఒకే వ్యాయామం.. తాడాట (స్కిప్పింగ్) తో ఫిట్‌నెస్ సాధ్యమవుతుందని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. శరీరంలోని అవయవాల కదలికను వేగవంతం చేయడంతోపాటు వాటి మధ్య సమన్వయానికి స్కిప్పింగ్ తోడ్పడుతుంది.
రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం గట్టి పడుతుంది. ఎముకలు గట్టి పడడంతోపాటుగా చర్మంపై ఏర్పడిన ముడతలు తొలగిపోతాయి. స్కిప్పింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.
పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల అరికాళ్లకు నొప్పి కలుగుతుంది. దాంతోపాటుగా పాదాలల్లో పగుళ్లు ఏర్పడతాయి. ముఖ్యంగా కాంక్రీటు నేలపై స్కిప్పింగ్ చేసేటప్పుడు షూస్ ధరించడం తప్పని సరి.
బరువు తగ్గించటంలో స్కిప్పింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. స్కిప్పింగ్ ప్రారంభించే ముందు వార్మప్ చేయడం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది. తొడలు, చేతులు, భుజాలు, పొట్ట భాగంలో ఏర్పడిన కొవ్వు నిల్వలు కరిగిపోయి కండరాలు పటిష్టంగా తయారవుతాయి. రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. బరువు తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది. అన్ని విధాలుగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేసినా చాలు.. ఆరోగ్యకరమైన ఫలితాలు కలుగుతాయని.. నిపుణులు చెబుతున్నారు.