లక్షలు ఖర్చు పెట్టి ముక్కును అందంగా తీర్చిదిద్దుకొనేవారున్నారు. మరి పైసా ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే మీ ముఖానికి అందం చేకూర్చే కొన్ని వ్యాయామాలు, ప్రత్యేకించి ముక్కు సరిచేసుకునేటందుకు కొన్ని భంగిమలు సూచిస్తున్నాం పరిశీలించండి. అందమైన మీ ముఖాన్ని మరింత అందంగా చేసుకోండి. 1. ముఖాకృతిని, ప్రత్యేకించి ముక్కును ఆకర్షణీయం చేసుకోవాలంటే యోగా అద్భుతంగా పనిచేస్తుంది. వెడల్పాటి ముక్కు సూదిగా సన్నంగా అవ్వాలంటే ప్రాణాయామం చేయండి. తిన్నగా కూర్చోండి చేతి కుడి బొటనవేలుతో ముక్కు రంధ్రాన్ని మూసేయండి. ఎడమ ముక్కు రంధ్రంతో 4 లెక్కపెట్టే వరకు గాలి పీల్చండి. మరో నాలుగు లెక్కపెట్టేంతవరకు దానిని బిగపట్టండి. గాలి వదిలేస్తూ 6 లెక్కపెట్టండి. ప్రాణాయామం క్రమం తప్పకుండా రోజూ చేస్తేమైండ్ రిలాక్స్, చక్కటి ముఖ రూపం, అందమైన ముక్కు సహజంగానే ఏర్పడతాయి.
2. రోజూ ముక్కు గట్టిగా పట్టుకొని పైకి ఎత్తండి. ముక్కు రంధ్రాలను బొటన వేలు, చూపుడు వేలుతో మూయటం, తెరవడం వంటివి గాలి పీలుస్తూ, వదులుతూ చేయాలి.
3. ముక్కును షేప్ చేసుకోడానికి, చర్మంపై ముడుతలు రాకుండా చేయడానికి ఫేషియల్ మసాజ్ మీ అంతట మీరే అరచేతులతో కిందనుండి పైకి చేయండి. మర్దనలో కొద్దిపాటి లవెండర్, జాస్మిన్ ఆయిల్ రాయండి. ఈ రకమైన వ్యాయామాలు ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తే ముఖ కండరాలను రిలాక్స్ చేసి వాటిలోని కొవ్వు తగ్గేలా చేయటం, ముక్కు కిరువైపులా ముడుతలు రాకుండా కూడా చేస్తాయి.