ఆరోగ్యం బాగుండాలంటే ఎవరైనా సరే రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఈ విషయం ఎవర్ని అడిగినా చెబుతారు. వైద్యులు అయితే ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయాలని సూచిస్తుంటారు. అయితే ఇది నిజమే. కానీ వారంలో 6 రోజులు వ్యాయామం చేస్తే చాలు. ఒక రోజు వ్యాయామానికి విరామం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మేం చెప్పడం లేదు. సైంటిస్టులు చెబుతున్నారు.
వ్యాయామం చేయడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అధిక బరువు తగ్గుతారు. అలాగే డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అయితే కొందరు అధిక బరువు తగ్గడం కోసం నిత్యం భారీ ఎత్తున వ్యాయామం చేస్తుంటారు. నిజానికి అలా చేయకూడదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అలాటే వారంలో 6 రోజులు వ్యాయామం చేస్తే చాలని, ఒక్క రోజు విరామం ఇవ్వాలని చెప్పారు.
వారంలో ఒక రోజు వ్యాయామానికి విరామం ఇవ్వడం వల్ల శరీరం కణజాలానికి మరమ్మత్తులు చేసుకుంటుంది. వ్యాయామాన్ని ప్రతి రోజూ బాగా చేస్తే శరీర కణజాలాలకు మంచిది కాదు. దీని వల్ల వ్యాయామం ద్వారా దెబ్బతిన్న కణజాల మరమ్మత్తుకు సమయం ఉండదు. దీంతో ఎముకలు, కండరాలపై ఒత్తిడి పడుతుంది. అటువంటప్పుడు ఆ కణజాలం మరిన్ని ఇబ్బందులకు గురవుతుంది. అలాగే ఎముకలు అయితే విరిగిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని సైంటిస్టులు పరిశోధనల ద్వారా వెల్లడించారు.
వ్యాయామం నుండి విరామం తీసుకోవడం కండరాలకు మాత్రమే కాదు, మానసిక స్థితికి కూడా మేలు చేస్తుంది. ఇది మీకు తాజా అనుభూతిని కలిగిస్తుంది. విశ్రాంతి తీసుకోవడం వల్ల మీకు మంచి నిద్ర వస్తుంది. ఇది ‘ఫీల్ గుడ్’ హార్మోన్ అనుభూతిని ఇస్తుంది. మానసిక స్థితిని సరిగ్గా ఉంచుతుంది. మీరు రోజూ వ్యాయామం చేస్తే శరీర కణజాలం, ఎముకలు ఇబ్బందులకు గురవుతాయి. కాబట్టి వ్యాయామానికి వారంలో ఒక రోజు విరామం ఇస్తే మంచిది. ఈ విషయంపై అమెరికన్ ఫిట్‌నెస్ సంస్థ ఏఐటీ మెథడ్ పరిశోధనలు చేసింది. 2వేల మంది ఇందులో పాల్గొన్నారు. తరువాత వచ్చిన ఫలితాలను విశ్లేషించి సైంటిస్టులు పైన తెలిపిన వివరాలను వెల్లడించారు. కాబట్టి నిత్యం భారీగా వ్యాయామం చేయకండి. అలాగే వారంలో ఒక రోజు వ్యాయామానికి విశ్రాంతి ఇవ్వండి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.