రోజూ మనం చేసేందుకు అనేక రకాల వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటి కన్నా తేలికైంది, ఖర్చు లేనిదీ.. వాకింగ్. వాకింగ్ చేయడం వల్ల అనే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రోజుకు 45 నిమిషాల పాటు.. అంటే సుమారుగా 3 కిలోమీటర్ల దూరం నడవడం వల్ల ఏడాదికి దాదాపుగా 1000కి పైగా కిలోమీటర్లను పూర్తి చేయవచ్చు. దీనిపై సైంటిస్టులు ఏమని చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఏడాదికి 1000కి పైగా కిలోమీటర్లు నడిచిన వారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని సైంటిస్టులు చెబుతున్నారు. అంటే రోజుకు దాదాపుగా 3 కిలోమీటర్లు అన్నమాట. ఈ దూరాన్ని 45 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. అందుకనే రోజుకు 45 నిమిషాల పాటు నడిస్తే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
2. రోజూ 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాస సమస్యలు తగ్గుతాయి.
3. రోజూ 45 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలను 40-50 శాతం వరకు తగ్గించుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. వాకింగ్ వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. ఎముకలు విరిగే అవకాశాలు 40 శాతం వరకు తగ్గుతాయి.
4. వాకింగ్ చేయడం వల్ల కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల నొప్పులను రాకుండా చూసుకోవచ్చు. హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
5. జీర్ణ సమస్యలు ఉన్నవారు వాకింగ్ చేస్తే మంచిది. జీర్ణవ్యవస్థలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కండరాలు దృఢంగా మారుతాయి.