నేటిరోజులలో శరీరంలోని అన్ని అవయవాలలోను కొవ్వు పేరుకుపోతోంది. ముఖాలలో సైతం కొవ్వు పేరుకొని సౌందర్యం చెదిరిపోతోంది. కొనదేలిన గడ్డం వుండి దవడ భాగం ఆకర్షణీయంగా వుంటే చూసేందుకు ఎంతో బాగుంటుంది. ప్రత్యేకించి పురుషులు ఇంగ్లీష్ సినిమాలలోని హీరోలవలే ఈ రకంగా వుండటానికి ఎంతో ఇష్టపడతారు. కొన్ని సులభ వ్యాయామాలతో మీ దవడలను సన్నపరచి మీరు చిన్నవారుగా కనపడేలా చేయటం ఎలానో పరిశీలించండి. ఈ రకమైన కొనదేలే గడ్డాలకు గాను సెలిబ్రిటీలు కాస్మెటిక్ సర్జరీలు సైతం చేయించుకుంటారు.
మేము వ్రాసే చిట్కాలతో కొనదేలే గడ్డం రావటం కొంత ఆలస్యమైనప్పటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కొద్దికాలంలోనే అందమైన మీ గడ్డాన్ని మరింత అందంగా చేసుకోవచ్చు.ముందుగా మీరు ఆహారాన్ని కూడా తగ్గించి అవసరం మేరకు తీసుకోవాలి. క్రీములు, లోషన్లు రాసేటపుడు మసాజ్ విధానం మీ గడ్డం వద్ద మొదలుపెట్టి పైవరుసగా బుగ్గల వద్దకు తీసుకురండి. ఈ రకంగా చేస్తే బుగ్గలు వేలాడకుండా వుంటాయి.
దవడ భాగం లేదా జా లైన్ పై ఐస్ ముక్కలు లేదా వేడి టవల్ వంటిది వేసి రోజూ ఒక నిమిషం పాటు మర్దన చేస్తే ఆ భాగంలోని చర్మం టైట్ గా వుంటుంది. మంచి దవడ భాగం వుండాలంటే ఫేషియల్ వ్యాయామాలు సహకరిస్తాయి. దీనిలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. గట్టితనం ఏర్పడుతుంది. చేయిని మెడపై పెట్టి సీలింగ్, ఇరువైపులు చూడటం చేయండి. ఈ వ్యాయామం కనీసం 10 లేదా 12 సార్లు రోజూ చేయాలి. స్ట్రెస్ బాల్ వంటి దానిని మీ గడ్డం కిందపెట్టి నొక్కటం ద్వారా ఒత్తిడి కలిగించవచ్చు. కొద్దిరోజులలో మీకిష్టమైన కొనదేలిన గడ్డం రావడం గ్రహిస్తారు. మీ దవడ భాగాలకు వేడినూనె మర్దన చేస్తూ పైకి, పక్కలకు ఒత్తిడి కలిగించండి.