వ్యాయామం

Walking : రోజుకు కేవ‌లం 30 నిమిషాలు న‌డిస్తే చాలు.. ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Walking : ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితులు, బిజీ జీవనశైలి కారణంగా మనలో చాలామందికి ఎక్సర్ సైజ్ చేయటానికి అసలు సమయమే చిక్కటం లేదు. దాంతో స్థూలకాయం, బీపీ, షుగర్‌, గుండె పోటు, ఒత్తిడి ఇలా ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. ఈ సమస్యల నుండి బయట పడటానికి ఎక్సర్ సైజ్ చేసే స‌మ‌య‌మే లేనివారు కేవలం 30 నిమిషాలు నడిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ చేస్తే ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు కలుగుతాయి.

ప్రతి రోజు 30 నిమిషాల పాటు నడిస్తే రక్త సరఫరా మెరుగు పడుతుంది. త‌ద్వారా గుండె నొప్పి, ఇతర గుండె జబ్బులు రాకుండా ఉండ‌ట‌మే కాకుండా శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీపీ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. రక్తపోటు ఉన్నవారిలో రక్త నాళాల్లో రక్త ప్రవాహనికి సరిపోయే ఆక్సిజన్ సప్లై అయ్యి కండరాలు మరింత రిలాక్స్ గా అయ్యి బ్లడ్ ప్రెజర్ ను అదుపులోకి తెస్తుంది.

many wonderful health benefits of walking 30 minutes per day

వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు దృఢంగా ఉండి కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి. డయబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు తగ్గి చాలా చురుకుగా మారతారు. ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాయామం చేస్తేనే మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది. అయితే వ్యాయామం అంటే జిమ్‌లో గంట‌ల త‌ర‌బ‌డి క‌స‌ర‌త్తులు చేయాల్సిన ప‌నిలేదు. రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే చాలు. ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. క‌నుక రోజూ వాకింగ్ చేయాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Admin

Recent Posts