అవును.. పెరుగుతుంది. వ్యాయామం చేయడం వల్ల చర్మంపై ఉండే మృత కణాలు పోతాయి. దీంతో చర్మం ప్రకాశవంతంగా, మెరుపుదనంతో దర్శనమిస్తుంది. అయితే ముఖంలో వచ్చిన కాంతి అలాగే కొనసాగాలంటే ఎప్పటికీ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల ముఖంలో కాంతి పెరుగుతుందా ? అంటే కచ్చితంగా పెరుగుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే క్రీడాకారులు, సెలబ్రిటీలు ఎప్పుడూ వ్యాయామం చేస్తుంటారు. కనుకనే వారికి వృద్ధాప్యం వచ్చినా ముఖం మీద కాంతి అలాగే ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు కనిపించవు. కనుక ఎవరైనా వ్యాయామం చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
అయితే చర్మం కాంతివంతంగా మారాలంటే నిత్యం కనీసం 45 నిమిషాలపాటు శరీరం మీద ఉండే చర్మం మొత్తానికి రక్త సరఫరా బాగా జరిగేలా చూడాలి. అందుకు గాను నిత్యం నీటిని తగినంత మోతాదులో తాగడంతోపాటు రక్త సరఫరా పెంచే వ్యాయామాలు చేయాలి. రన్నింగ్, వాకింగ్, జాగింగ్ వంటివి చేయవచ్చు.
ఇక యోగాలో శీర్షాసనం వేస్తే తలకు బాగా రక్త సరఫరా అవుతుంది. దీంతో ముఖంలో కాంతి పెరుగుతుంది. అయితే ఈ ఆసనం వేయడం కొద్దిగా కష్టమే. కానీ ప్రాక్టీస్ చేస్తే త్వరగానే ఈ ఆసనం వేయడాన్ని నేర్చుకోవచ్చు. దీంతో నిత్యం ఈ ఆసనం వేసి చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.