మన శరీరంలోకి ఏవైనా సూక్ష్మ క్రిములు ప్రవేశించగానే మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ ఆ క్రిములను నాశనం చేస్తుంది. అందుకు గాను మన రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. అయితే ప్రస్తుతం చాలా మందికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. అందువల్ల చాలా సులభంగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే వారు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన 10 ఆహారాలు ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
వెల్లుల్లి అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఇది ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. పరగడుపునే 1 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో విటమిన్ బి6, సి, ఫాస్ఫరస్, మాంగనీస్, జింక్, కాల్షియం, ఐరన్ తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లను తట్టుకునే శక్తి లభిస్తుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
నారింజ, నిమ్మకాయలు వంటివి ఈ కోవకు చెందుతాయి. వీటిల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. రోజూ ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది.
భారతీయుల వంటి ఇంటి పదార్థాల్లో అల్లం కూడా ఒకటి. ఇది వాపులను తగ్గిస్తుంది. గొంతు సమస్యలు తగ్గుతాయి. వికారం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లంలో విటమిన్ బి6, మెగ్నిషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. రోజూ పరగడుపునే 2 టీస్పూన్ల అల్లం రసం సేవిస్తే ప్రయోజనం ఉంటుంది.
పాలకూరలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, కె, మెగ్నిషియం, మాంగనీస్, ఐరన్, ఫోలేట్, విటమిన్ బి6, విటమిన్ ఇ, కాల్షియం, పొటాషియం తదితర అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పాలకూరను పోషకాలకు గనిగా భావిస్తారు. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అయితే కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు దీన్ని తీసుకోవడంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
పెరుగులో విటమిన్ బి12, రైబోఫ్లేవిన్, సెలీనియం, కాల్షియం తదితర పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా చూస్తాయి. నిత్యం ఆహారంలో పెరుగును తీసుకుంటే ఫలితం ఉంటుంది.
బాదంపప్పులో విటమిన్ ఇ, సి, ఒమెగా 3, 6, 9 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రోజూ గుప్పెడు బాదం పప్పును తింటే ప్రయోజనాలను పొందవచ్చు.
గ్రీన్ టీలో ఈజీసీజీ అనబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అందువల్ల రోజుకు కనీసం 2 కప్పుల గ్రీన్ టీని తాగితే ఈ యాంటీ ఆక్సిడెంట్ మన శరీరంలో ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉంటాయి.
బొప్పాయి పండ్లలో ఉండే విటమిన్ సి, పపైన్ అనబడే ఎంజైమ్, ఫోలేట్ అనే పోషక పదార్థం రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. బొప్పాయి పండ్లను రోజూ తినడం వల్ల ప్రయోజనాలను పొందవచ్చు.
పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఫాస్ఫరస్, మెగ్నిషియం, విటమిన్ బి6, విటమిన్ ఇ తదితర పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
కివీ పండ్లలో ఫోలేట్, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ, లుటీన్, జియాంతిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాక ఇన్‌ఫెక్షన్లకు కారణం అయ్యే క్రిములను నాశనం చేస్తాయి. వ్యాధులు రాకుండా ఉంటాయి.