Fish : చేప తల తినేవారు ఒక్కసారి ఈ విష‌యాల‌ను తెలుసుకోండి.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Fish : మాంసాహారం అంటే ఇష్టంగా తినేవారిలో చాలా మంది చేపలను కూడా తింటుంటారు. అయితే చేపల్లో ఎన్ని ఔషధ గుణాలు, పోషక విలువలు ఉంటాయో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా చేపల తలలను మాంసాహార ప్రియులు కచ్చితంగా తినాల్సిందే. చేపల తలలో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు అనేక వ్యాధులు రాకుండా కాపాడుతాయి.

amazing benefits of eating Fish head

చేప లలో అనేక విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. చేపలను తినేవారిలో చాలా మంది చేప తలను తినరు. కానీ కొందరు మాత్రం చేప తలను ఇష్టంగానే తింటారు. 100 గ్రాముల చేప తలలో అనేక పోషక విలువలు ఉంటాయి.

100 గ్రాముల చేప తలను తినడం వల్ల మనకు 206 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు 12 గ్రాముల మేర లభిస్తాయి. వాటిల్లో శాచురేటెడ్‌ ఫ్యాట్‌ 2.5 గ్రాములు, కొలెస్ట్రాల్‌ 63 మిల్లీగ్రాములు ఉంటాయి. ఇక సోడియం, పొటాషియం వంటి పోషకాలతోపాటు చేప తలను తినడం వల్ల ప్రోటీన్లు కూడా 22 గ్రాముల మేర లభిస్తాయి. అందువల్ల చేప తలను ప్రోటీన్లకు ఉత్తమమైన వనరు అని చెప్పవచ్చు.

ఇతర మాంసాహారాలతో పోలిస్తే చేప తలలోనే ఎక్కువ పోషకాలు, ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల చేప తలను తింటే కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ పెరుగుతాయని భయం చెందాల్సిన పనిలేదు. పైగా చేప తలను తింటే బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా గుండెను సంరక్షించుకోవచ్చు.

చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చేప తలలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు, గుండె జబ్బులతో ఇప్పటికే బాధపడుతున్నవారు చేప తలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. దీని వల్ల గుండె పదిలంగా ఉంటుంది. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అసాధారణ రీతిలో కొట్టుకునే గుండె సాధారణ రీతిలో కొట్టుకొంటుంది. అంటే గుండె కొట్టుకునే రేటు సరిగ్గా ఉంటుందన్నమాట.

చేప తలలో, మెదడులో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. అందువల్ల వాటిని తింటే కళ్లకు ఎంతగానో మేలు జరుగుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. విటమిన్‌ ఎ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీంతో ఫ్రీ ర్యాడికల్స్‌ నాశనం అవుతాయి. క్యాన్సర్‌, డయాబెటిస్‌, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

చేప తలలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, డీహెచ్‌ఏ మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో ఒత్తిడి, డిప్రెషన్‌ నుంచి బయట పడవచ్చు. డిప్రెషన్‌తో బాధపడుతున్న వారు చేప తలను తింటే దాని నుంచి తప్పించుకోవచ్చు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.

డయాబెటిస్, ఆర్థరైటిస్‌ సమస్యలు ఉన్నవారు చేప తలను తింటే ఫలితం ఉంటుంది. దీంతో మెటబాలిజం మెరుగు పడుతుంది. షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Editor

Recent Posts