కరోనా నేపథ్యంలో చాలా మందికి కామన్‌గా పలు లక్షణాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. కొందరికి అసలు లక్షణాలు ఉండవు. కొందరికి పొడి దగ్గు, జ్వరం, జలుబు వంటివి కామన్‌గా ఉంటాయి. అయితే కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తున్న కొద్దీ కొత్త లక్షణాలను కూడా సైంటిస్టులు ఈ జాబితాలో చేర్చారు. కానీ ప్రస్తుతం చాలా మందికి టైఫాయిడ్ వస్తున్నందున ఏది కరోనా వైరస్ లక్షణమో, ఏది టైఫాయిడ్ లక్షణమో తెలియిక ఆందోళన చెందుతున్నారు. మరి ఈ రెండింటి మధ్య ఉండే తేడాలు ఇప్పుడు తెలుసుకుందామా..!
మనం తినే ఆహారాలు, తాగే పానీయాలు కలుషితం అయితే వాటి ద్వారా మనకు టైఫాయిడ్ వస్తుంది. సాల్మొనెల్లా టైఫి అనే బాక్టీరియా ద్వారా టైఫాయిడ్ వస్తుంది. బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వల్ల ఇది వస్తుంది. ఈ క్రమంలోనే టైఫాయిడ్ వచ్చిన వారిలో పలు లక్షణాలు కనిపిస్తాయి.
టైఫాయిడ్ లక్షణాలు
- నీరసంగా ఉండడం
- ఆకలి లేకపోవడం
- తలనొప్పి
- ఒళ్లు నొప్పులు
- జలుబు, జ్వరం
- బద్దకంగా ఉండడం
- నీళ్ల విరేచనాలు కావడం
- జీర్ణ వ్యవస్థ సమస్యలు
- 102 డిగ్రీల నుంచి 104 డిగ్రీల జ్వరం
ఈ లక్షణాల్లో కొన్ని కోవిడ్ వచ్చిన వారికి కూడా ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే ముందుగా కోవిడ్ టెస్టు చేయించుకోవాలి. అందులో నెగెటివ్ వస్తే డాక్టర్‌ను సంప్రదించి టైఫాయిడ్ టెస్టులు చేయించుకోవాలి. టైఫాయిడ్ ఉన్నట్లు తేలితే డాక్టర్ సూచన మేరకు మందులను వాడాలి.
జాగ్రత్తలు
- వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి
- చేతులను తరచూ సబ్బు లేదా హ్యాండ్ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. వీలుంటే గోరు వెచ్చని నీటిని వాడాలి.
- గోరు వెచ్చని నీటిని తాగాలి.
- పచ్చిగా ఉన్న కూరగాయలను తినరాదు.
- ఆహారాన్ని బాగా ఉడికించాలి.
- రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి దూరంగా ఉండాలి.
- ఆహారాన్ని ఇతరులతో షేర్ చేసుకోరాదు.
- పేస్ట్రీలు, వేపుళ్లు, స్వీట్లు, ఇతర జంక్‌ఫుడ్ మానేయాలి.
- మాంసాహారం మానేయాలి. మద్యం సేవించరాదు. పొగ తాగరాదు.
కోవిడ్ 19 లక్షణాలు
కోవిడ్ వచ్చిన వారిలో సహజంగా కనిపించే లక్షణాలు
- జ్వరం
- పొడి దగ్గు
- అలసట
- అరుదుగా కనిపించే లక్షణాలు
- నొప్పులు
- గొంతు నొప్పి
- విరేచనాలు
- కళ్ల కలక
- తలనొప్పి
- రుచి లేదా వాసన కోల్పోవడం
- చర్మంపై దద్దుర్లు ఏర్పడడం లేదా చేతి, కాలి వేళ్లు రంగు మారడం
సీరియస్ అయిన వారిలో కనిపించే లక్షణాలు
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, శ్వాస సరిగ్గా అందకపోవడం
- ఛాతిలో నొప్పి, బరువుగా ఉన్నట్లు అనిపించడం
ఈ విధంగా టైఫాయిడ్, కోవిడ్ లక్షణాలను గమనించవచ్చు. దీని వల్ల అనారోగ్య సమస్యలకు అనుగుణంగా చికిత్సను తీసుకునేందుకు వీలుంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365