మనలో అధికశాతం మంది టీ లేదా కాఫీ తాగేముందు ఒక గ్లాస్ నీటిని తాగుతుంటారు. అయితే కొందరు నిజానికి ఈ విధంగా ఎందుకు చేస్తారో తెలియదు. ఇతరులు పాటిస్తున్న అలవాటును చూసి ఎవరైనా అలవాటు చేసుకుంటారు. అసలు టీ, కాఫీ తాగేముందు నీటిని ఎందుకు తాగుతున్నారో తెలియకుండానే ఆ పని చేస్తున్నారు. కానీ నిజానికి అలా చేయడం మంచిదే. సైంటిస్టులు ఇందుకు పలు కారణాలను కూడా చెబుతున్నారు. అవేమిటంటే…
* టీ, కాఫీలు ఆమ్ల (యాసిడ్) స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకని వాటిని తాగేముందు నీటిని తాగితే నోట్లో యాసిడ్ ప్రభావం పడకుండా ఉంటుంది. కనుక టీ, కాఫీ తాగేముందు కచ్చితంగా నీటిని తాగాలి.
* టీ, కాఫీలలో టానిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది దంతాల రంగును మారుస్తుంది. ఆ విధంగా జరగకుండా ఉండాలంటే.. టీ, కాఫీలను తాగేముందు నీటిని తాగాలి.
* టీ, కాఫీలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి కనుక అవి జీర్ణాశయంలో అల్సర్లను కలగజేస్తాయి. ఆ విధంగా జరగకుండా ఉండాలంటే.. వాటిని తాగేముందు నీటిని తీసుకోవాలి. దీంతో అవి జీర్ణాశయంలోకి వెళ్లినా.. నీటితో కలుస్తాయి కనుక పెద్దగా ప్రభావం పడదు.
* టీ, కాఫీలను తాగడం వల్ల సహజంగానే మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శరీరంలో ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. కనుక దాన్ని నివారించేందుకు టీ, కాఫీలకు ముందు నీటిని తాగాలి.
* నీటిని తాగకుండా టీ, కాఫీలను నేరుగా తాగితే దీర్ఘకాలంలో జీర్ణాశయ సమస్యలు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే.. టీ, కాఫీలను తాగేముందు నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో ఆయా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.