Piles : పైల్స్ సమస్య అనేది అనేక కారణాల వల్ల వస్తుంటుంది. మాంసాహారం ఎక్కువగా తినడం, అధిక బరువు, గంటల తరబడి కూర్చుని ఉండడం, డయాబెటిస్, థైరాయిడ్.. వంటి అనేక కారణాల వల్ల పైల్స్ వస్తుంటాయి. దీని వల్ల తీవ్రమైన అవస్థ కలుగుతుంది. అయితే కింద తెలిపిన ఆహారాలను రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల పైల్స్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. దీంతోపాటు మలబద్దకం కూడా తగ్గుతుంది. మరి పైల్స్‌ను తగ్గించుకునేందుకు రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటంటే..

1. కిస్మిస్‌లలో జింక్, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. రాత్రిపూట కొన్ని కిస్మిస్‌లను తీసుకుని తినాలి. దీంతో మరుసటి రోజు ఉదయం విరేచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. దీంతో పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. రాత్రి పూట కిస్మిస్‌లను నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం కూడా తినవచ్చు. ఎలా తిన్నా సమస్య నుంచి బయట పడతారు.
2. బాదంపప్పులో ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. అందువల్ల బాదంపప్పును రోజూ తింటే పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇందుకు గాను బాదంపప్పును రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే వాటిని పొట్టు తీసి తినాలి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవడంతోపాటు మలబద్దకం తగ్గుతుంది. పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు.
3. జామ పండ్లలో విటమిన్లు, మినరల్స్ అనేకం ఉంటాయి. ఇవి దంతాలు, చిగుళ్ల సమస్యలు, జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. జామ పండ్లను తినడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. అలాగే పైల్స్ కూడా తగ్గిపోతాయి. రోజూ రాత్రి భోజనం చేసిన తరువాత నిద్రకు ముందు ఒక జామ పండును తింటే ప్రయోజనం కలుగుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
4. రోజూ ఉదయాన్నే పరగడుపునే 3 లేదా 4 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పెనంపై వేసి వేయించి వాటిని అలాగే తినాలి. నేరుగా తినలేం అనుకుంటే తేనెతో కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం నుంచి బయట పడతారు. మలబద్దకం తగ్గి పైల్స్ నుంచి విముక్తి పొందవచ్చు.
5. జీర్ణ సమస్యలను తగ్గించడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ రాత్రి భోజనం అనంతరం చిన్న బెల్ల ముక్కను తినాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. క్రమం తప్పకుండా రోజూ రాత్రి బెల్లంను తింటే పైల్స్ సమస్య నుంచి కూడా బయట పడవచ్చు.