Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Featured

Heart Health : చలి కాలం వచ్చేసింది.. గుండె ఆరోగ్యం జాగ్రత్త..!

Editor by Editor
October 28, 2021
in Featured, ఆరోగ్యం & ఫిట్‌నెస్
Share on FacebookShare on Twitter

Heart Health : రాబోయే కొద్ది రోజుల్లో చలి మొదలవుతుంది. ఉష్ణోగ్రత తగ్గడంతో ప్రజలకు గుండె సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి. మారుతున్న కాలంలో గుండెపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి ఏదైనా సమస్య ఉంటే అప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి. సకాలంలో చికిత్స చేస్తే గుండె జబ్బులను సులభంగా నియంత్రించవచ్చు. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని, దానివల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయని, శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగదని.. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అజిత్ జైన్ చెబుతున్నారు.

Heart Health take care of heart in the winter season

రక్త సరఫరా తగ్గడం వల్ల గుండెకు ఆక్సిజన్ తక్కువగా చేరుతుంది. దీంతో శరీరానికి రక్తం, ఆక్సిజన్‌ను అందించడానికి గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు మొదలవుతాయి. కోవిడ్ (కరోనా వైరస్) తర్వాత గుండె జబ్బులు ఉన్నవారు లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

గుండె ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోవిడ్ తర్వాత అధిక రక్తపోటు, గుండె ఆగిపోవడం వంటి కేసులు చాలా మందిలో కనిపించాయి. అందుకే ఆందోళన ఎక్కువైందని.. గత కొన్నేళ్లుగా యువతకు కూడా గుండె జబ్బులు రావడం మొదలైందని సర్ గంగా రామ్ ఆస్పత్రి కార్డియాలజీ విభాగం డాక్టర్ ఎస్సీ మంచంద చెబుతున్నారు.

గతంలో 50 ఏళ్లు పైబడిన వారు గుండె సంబంధిత సమస్యలతో వైద్యం కోసం వచ్చేవారని, ఇప్పుడు 30 నుంచి 35 ఏళ్లలోపు రోగులు వస్తున్నారన్నారు. గత కొన్ని నెలలుగా యువకులకు ఇలాంటి అనేక గుండె శస్త్రచికిత్సలు జరిగాయి. అందుకే ఇప్పుడు గుండె జబ్బుల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, కోవిడ్ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు గుండె సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మారుతున్న సీజన్‌లో జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే కాలంలో హృద్రోగుల సంఖ్య వేగంగా పెరుగుతుంది.. అని చెబుతున్నారు.

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. రెగ్యులర్ గా చెకప్‌లు చేయించుకోవాలి. ఒక వ్యక్తి గుండె జబ్బుకు చెందిన ఏవైనా లక్షణాలను అనుభవిస్తే అతను వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ శరీరాన్నంతా పరీక్షించుకోవాలి. పరీక్షలలో కొలెస్ట్రాల్ పెరిగినట్లు తేలితే.. వైద్యుడిని సంప్రదించిన తర్వాత చికిత్స ప్రారంభించాలి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి, అధిక రక్తపోటు, బలహీనత.. వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు. అవి గుండె సంబంధ లక్షణాలు అయి ఉండేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కనుక గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు గాను.. రోజూ వ్యాయామం చేయాలి. సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్ తినకండి. క్రమం తప్పకుండా మందులు తీసుకోండి. నిరంతరం వైద్యుల సూచనలు పాటించండి. దీంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Tags: heart careheart healthwinter health tipsగుండె ఆరోగ్యంగుండె సంర‌క్ష‌ణ‌చ‌లికాలం ఆరోగ్య చిట్కాలు
Previous Post

Pregnancy Tips : గర్భంతో ఉన్న మహిళలు సౌందర్య ఉత్పత్తులను వాడుతున్నారా.. జర జాగ్రత్త అంటున్న నిపుణులు..!

Next Post

Weight Loss Tips : రోజూ 5 నిమిషాల పాటు ఇలా చేస్తే.. బ‌రువును సుల‌భంగ్గా త‌గ్గించుకోవ‌చ్చు..!

Related Posts

Featured

Vegan Diet : పూర్వ‌కాలంలో రుషులు తిన్న ఆహారం ఇది.. ఇలా తింటే మ‌న‌కు ఎలాంటి రోగాలు రావు..!

April 24, 2022
Featured

Diabetes : షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగేది ఇందుకే.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన సీక్రెట్‌..!

March 29, 2022
Featured

Finger : కాలి బొట‌న‌వేలి క‌న్నా చూపుడు వేలు పొడ‌వుగా ఉంటే మ‌హిళ‌లు త‌మ భ‌ర్త‌ల‌ను ఆటాడిస్తారా ?

March 18, 2022
Featured

Chanakya Tips : ఆఫీస్ రాజ‌కీయాల్లో బ‌లి కాకుండా ఉండాలంటే.. ఉద్యోగులు ఈ చాణ‌క్య సూత్రాల‌ను పాటించాలి..!

March 4, 2022
Featured

Useful Trick : విప‌త్క‌ర ప‌రిస్థితిలో ప‌నిచేసే ట్రిక్ ఇది.. మ‌హిళ‌ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది..!

March 1, 2022
Featured

Japan People : జ‌పాన్ దేశ‌వాసులు అంత స‌న్న‌గా ఎందుకు ఉంటారో తెలుసా ? వారి ఆరోగ్య ర‌హ‌స్యాలు ఏమిటి ?

March 1, 2022

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.