Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Featured

నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Admin by Admin
January 18, 2021
in Featured
Share on FacebookShare on Twitter

శ‌రీరాన్ని ఎల్ల‌ప్పుడూ మనం హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అంటే ఎప్పుడూ శ‌రీరంలో త‌గినంత నీరు ఉండేలా చూసుకోవాల‌న్న‌మాట‌. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. నిత్యం త‌గినంత నీటిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఏ సీజ‌న్ అయినా, ఎక్క‌డ ఉన్నా, ఎప్పుడు అయినా స‌రే.. రోజులో తాగాల్సిన నీటి కోటాను క‌చ్చితంగా పూర్తి చేయాలి. దీంతో శ‌రీరంలో నీరు త‌గినంత ఉంటుంది. అయితే నీటిని నిత్యం త‌గిన మోతాదులో తాగడం వ‌ల్ల కూడా అధిక బ‌రువు తగ్గ‌వ‌చ్చు. అవును.. ఈ విష‌యాన్ని సాక్షాత్తూ సైంటిస్టులే చెబుతున్నారు.

how to drink water for weight loss in telugu

2011లో ఒబెసిటీ అనే ఓ జ‌ర్న‌ల్‌లో ఓ అధ్య‌యనాన్ని ప్ర‌చురించారు. దాని ప్ర‌కారం నీటిని నిత్యం త‌గిన మోతాదులో తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతార‌ని వెల్ల‌డైంది. అలాగే 2017లో ఇంట‌ర్నేష‌న‌ల్ జర్న‌ల్ ఆఫ్ ఒబెసిటీలోనూ మ‌రో అధ్య‌య‌నాన్ని ఇదే విష‌యంపై ప్ర‌చురించారు. కొంద‌రు నిత్యం తాము తాగే వివిధ ర‌కాల డ్రింక్స్‌కు బ‌దులుగా నీటిని తాగారు. దీంతో 12 నెల‌ల‌పాటు వారు అలా చేయ‌గా.. వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గాయ‌ని, ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరిగింద‌ని (శ‌రీరం ఇన్సులిన్‌ను ఉప‌యోగించుకునే తీరు), అధిక బ‌రువు త‌గ్గార‌ని గుర్తించారు. అందువ‌ల్ల నీటిని నిత్యం తగిన మోతాదులో తాగితే కచ్చితంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

* భోజ‌నం చేయ‌డానికి క‌నీసం 15 నిమిషాల ముందు నీటిని తాగితే ఆక‌లి త‌గ్గుతుంద‌ని, దీంతో క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంద‌ని సైంటిస్టులు తెలిపారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆహారం తక్కువ‌గా తింటార‌ని, దీంతో శ‌రీరానికి క్యాల‌రీలు త‌క్కువ‌గా అందుతాయ‌ని, ఫ‌లితంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని తెలిపారు.

* త‌గిన మోతాదులో నీటిని తాగడం వ‌ల్ల మ‌నం తినే ఆహారాల్లో ఉండే కార్బొహైడ్రేట్లు (పిండి ప‌దార్థాలు), ఫ్యాట్స్ (కొవ్వులు) వేగంగా జీర్ణం అవుతాయ‌ని, వాటి వ‌ల్ల శ‌రీరానికి ల‌భించే క్యాల‌రీలు కూడా త్వ‌ర‌గా ఖ‌ర్చ‌వుతాయ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.

* నిత్యం నీటిని త‌గిన మోతాదులో తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. దీంతో వాపులు త‌గ్గుతాయి. ఒంట్లో ఉండే చెడు నీరు బ‌య‌ట‌కు పోతుంది. శ‌రీరం స‌న్న‌గా క‌నిపిస్తుంది. బ‌రువు కూడా త‌గ్గుతారు.

* కొన్నిసార్లు మెద‌డు ఆక‌లికి, దాహానికి క‌న్‌ఫ్యూజ్ అయి సిగ్న‌ల్స్ ను వేరుగా పంపిస్తుంది. దీంతో కొంద‌రు ఆక‌లి అవుతుంద‌ని పొర‌పాటు ప‌డి ఆహారం తీసుకుంటారు. అయితే మీకు కూడా అలా కొన్ని సంద‌ర్భాల్లో వింత‌గా ఆక‌లి అనిపిస్తుంటే నీరు తాగి చూడండి. ఆక‌లి త‌గ్గుతుంది. అలా గ‌న‌క జ‌రిగితే మీ మెద‌డు త‌ప్పు సిగ్న‌ల్స్ ఇచ్చిన‌ట్లే లెక్క‌. దీంతో నీరు తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి అద‌న‌పు క్యాల‌రీలు ల‌భించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

* వ్యాయామం చేసేట‌ప్పుడు కండ‌రాల‌పై ఒత్తిడి ఎక్కువ‌గా ప‌డుతుంది. అలాంట‌ప్పుడు నీటిని ఎక్కువ‌గా తాగాలి. దీంతో కండ‌రాలు, క‌ణ‌జాలం, కీళ్లు సరిగ్గా ప‌నిచేస్తాయి. ఈ క్ర‌మంలో కండ‌రాల నొప్పులు, అల‌స‌ట త‌గ్గుతాయి. అలాగే వ్యాయామం ఎక్కువ సేపు చేయ‌గ‌లుగుతారు. బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గ‌గ‌లుగుతారు.

సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికీ తాము ఎంత నీటిని తాగాలి ? అనే విష‌యం తెలియ‌దు. అయితే ఎవ‌రైనా స‌రే త‌మ ఎత్తు, బ‌రువు, చేసే ప‌ని, జీవించే వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా నీటిని తాగాలి. స‌హజంగానే శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసే వారు, వేడి వాతావ‌ర‌ణంలో ఉండే వారు, చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్టే వారు నిత్యం ఎక్కువ మోతాదులో నీటిని తాగాలి. వారు క‌నీసం 3 లేదా 4 లీట‌ర్ల వ‌ర‌కు అవ‌స‌రాన్ని బ‌ట్టి నీటిని తాగాల్సి ఉంటుంది. అదే ఇత‌రులు అయితే 2 లీట‌ర్ల వ‌ర‌కు నీటిని తాగినా చాలు. క‌నుక నీటిని త‌గిన మోతాదులో నిత్యం తాగితే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డంతోపాటు ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

Tags: adhika baruvubaruvu thaggadamdrinking waterobesityover weightsthulakayamtagu neeruweight loss
Previous Post

జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు దేశంలో కోవిడ్ ఆంక్ష‌ల పొడిగింపు.. కేంద్ర హోం శాఖ ఉత్త‌ర్వులు..

Next Post

క్రాన్ బెర్రీలను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుతమైన ప్ర‌యోజ‌నాలు..!

Related Posts

Featured

Vegan Diet : పూర్వ‌కాలంలో రుషులు తిన్న ఆహారం ఇది.. ఇలా తింటే మ‌న‌కు ఎలాంటి రోగాలు రావు..!

April 24, 2022
Featured

Diabetes : షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగేది ఇందుకే.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన సీక్రెట్‌..!

March 29, 2022
Featured

Finger : కాలి బొట‌న‌వేలి క‌న్నా చూపుడు వేలు పొడ‌వుగా ఉంటే మ‌హిళ‌లు త‌మ భ‌ర్త‌ల‌ను ఆటాడిస్తారా ?

March 18, 2022
Featured

Chanakya Tips : ఆఫీస్ రాజ‌కీయాల్లో బ‌లి కాకుండా ఉండాలంటే.. ఉద్యోగులు ఈ చాణ‌క్య సూత్రాల‌ను పాటించాలి..!

March 4, 2022
Featured

Useful Trick : విప‌త్క‌ర ప‌రిస్థితిలో ప‌నిచేసే ట్రిక్ ఇది.. మ‌హిళ‌ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది..!

March 1, 2022
Featured

Japan People : జ‌పాన్ దేశ‌వాసులు అంత స‌న్న‌గా ఎందుకు ఉంటారో తెలుసా ? వారి ఆరోగ్య ర‌హ‌స్యాలు ఏమిటి ?

March 1, 2022

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.