నిద్రలేమి సమస్య అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీనికి అనేక కారణాలు ఉంటున్నాయి. ప్రధాన కారణం, ఒత్తిడి. దీంతోపాటు మానసిక సమస్యల వల్ల కూడా చాలా మందికి నిద్ర పట్టడం లేదు. అయితే బెడ్ మీద పడుకున్నాక చాలా గంటల పాటు అటు దొర్లి ఇటు దొర్లి ఎప్పటికో ఆలస్యంగా నిద్ర పోతుంటారు. కానీ కింద తెలిపిన ట్రిక్స్ ను సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే బెడ్ మీద పడుకున్నాక కేవలం 2 నిమిషాల్లోనే నిద్ర పోవచ్చు. మరి ఆ ట్రిక్స్ ఏమిటంటే..
కేవలం 2 నిమిషాల్లోనే నిద్రపోయేందుకు రెండు ట్రిక్స్ ఉన్నాయి. అవేమిటంటే.. ఒకటి The United States Navy Flight School టెక్నిక్. దీన్ని 6 వారాల పాటు ప్రాక్టీస్ చేయాలి. సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే బెడ్ పై పడుకున్నాక కేవలం 2 నిమిషాల్లోనే నిద్ర పోవచ్చు. దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే..
* బెడ్ మీద పడుకున్నాక రిలాక్స్ అవ్వాలి. ముఖం, నోరు భాగాలను రిలాక్స్ అయినట్లు ఫీలవ్వాలి. తరువాత భుజాలు, నెమ్మదిగా చేతులు, కాళ్లను కూడా తేలిగ్గా ఉన్నట్లు ఫీలవ్వాలి. రిలాక్స్ అవ్వాలి. శరీరం మొత్తాన్ని లైట్‌గా ఉన్నట్లు అనుకోవాలి. అన్ని భాగాలు రిలాక్స్ అవుతున్నట్లు ఫీల్వవాలి. మనస్సులో ఏ ఆలోచన ఉండకూడదు. ఖాళీగా ఉందని అనుకోవాలి. ప్రశాంతమైన స్థితిని ఊహించాలి. 10 సెకన్ల పాటు don’t think అని అనుకోవాలి. దీన్ని 10 సార్లు చేయాలి. ఈ విధంగా రోజూ రాత్రి బెడ్‌పై పడుకున్నాక చేయాలి. 6 వారాల పాటు ఇలా ప్రాక్టీస్ చేస్తే కచ్చితంగా వేగంగా నిద్రపోతారు. అమెరికాలో నేవీ, ఫ్లైట్ స్కూల్‌లలో విద్యార్థులు ఈ టెక్నిక్‌ను పాటిస్తారు.
బెడ్‌పై పడుకున్నాక 2 నిమిషాల్లో నిద్ర పోవాలంటే ఇంకో టెక్నిక్ ఉంది. అదే 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్. దీన్ని ఎలా చేయాలంటే..
* బెడ్‌పై పడుకుని ముందుగా ముఖం, భుజాలు, చేతులు, కాళ్లను రిలాక్స్ ఫీలవ్వాలి. కళ్లు తెరిచే ఉంచాలి. 4 సెకన్ల పాటు సుదీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. శ్వాసను పీల్చాలి. దాన్ని 7 సెకన్ల పాటు అలాగే ఆపి ఉంచాలి. తరువాత 8 సెకన్ల పాటు శ్వాసను నెమ్మదిగా వదలాలి. ఇలా 10 సార్లు చేయాలి. నిద్ర పట్టేంత వరకు కూడా చేయవచ్చు. దీన్ని కూడా 6 వారాల పాటు చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. బెడ్‌మీద పడుకున్నాక 2 నిమిషాల్లోనే నిద్ర పోవచ్చు.
4 సెకన్ల పాటు గాలి పీల్చి 7 సెకన్ల పాటు గాలిని బంధించి 8 సెకన్ల పాటు గాలిని వదలాలి. అందుకనే దీనికి 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అని పేరు వచ్చింది. దీన్ని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు సూచిస్తుంటారు.