Male Health : స్పెర్మ్ కౌంట్ (వీర్యకణాల సంఖ్య)ను వృద్ధి చేసే ఆహారాలు.. వీటిని తీసుకుంటే చాలు..!

Male Health : ప్ర‌స్తుత త‌రుణంలో కొంద‌రు జంట‌లు సంతానం లేక నిరాశా నిస్పృహ‌ల‌కు లోన‌వుతున్నారు. అయితే సంతాన‌లోపానికి స్త్రీల‌తోపాటు పురుషులు కూడా కార‌ణ‌మ‌వుతున్నారు. వారిలో వీర్య క‌ణాల సంఖ్య తక్కువ‌గా ఉండ‌డం ప్ర‌ధానంగా క‌నిపిస్తున్న స‌మ‌స్య‌. అయితే ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు కింద ఇచ్చిన ఆహారాలు దోహ‌ద‌ప‌డతాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌డం ద్వారా పురుషులు త‌మ వీర్య క‌ణాల సంఖ్య‌ను వృద్ధి చేసుకోవ‌చ్చు. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి. అలాగే కొన్ని ఆహారాల వ‌ల్ల శృంగార సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంది. మ‌రి పురుషుల ఆరోగ్యానికి సంబంధించి ఉప‌యోగ‌ప‌డే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

Male Health sperm count increasing foods

1. రోజూ ఒక‌టి అర‌టి పండును తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో స్మెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అర‌టి పండ్ల‌లో విట‌మిన్లు బి1, ఎ, సిలు ఉంటాయి. ఇవి వీర్య క‌ణాల సంఖ్య‌ను పెంచేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి.

2. డార్క్ చాక్లెట్, మాంసం, విత్త‌నాలు, న‌ట్స్‌, బచ్చలి కూర, కాయధాన్యాలు, తృణధాన్యాలు, సోయా, చేప‌లు, కోడిగుడ్ల‌లో ఎల్‌-అర్జినైన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది వీర్య క‌ణాల సంఖ్య‌ను పెంచుతుంది. అందుక‌ని ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.

3. పురుషులు రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు ప‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తినాలి. నేరుగా తిన‌లేక‌పోతే పెనంపై వేయించి రోస్ట్‌లా చేసి తిన‌వ‌చ్చు. లేదా తేనెలో క‌లిపి తిన‌వ‌చ్చు. దీని వ‌ల్ల పురుషుల్లో జ‌న‌నావ‌య‌వాల‌కు ర‌క్త స‌రఫ‌రా మెరుగు ప‌డుతుంది. శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. వీర్య క‌ణాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి.

4. వీర్య కణాల సంఖ్య‌ను పెంచేందుకు దానిమ్మ పండు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని రోజుకు ఒకటి తినాలి. లేదా ఒక గ్లాస్ దానిమ్మ పండు జ్యూస్‌ను రోజూ తాగాలి. దానిమ్మ పండ్ల‌లో ఉండే ఎండీఏ అనే స‌మ్మేళ‌నం వీర్య క‌ణాల సంఖ్య‌ను పెంచుతుంది.

5. పాల‌కూర‌లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వీర్యం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేందుకు స‌హ‌క‌రిస్తుంది. క‌నుక పురుషులు పాల‌కూర‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి.

6. క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ స‌మృద్ధిగా ఉంటుంది. వీర్యం ఎక్కువ‌గా త‌యార‌య్యేందుకు విట‌మిన్ ఎ స‌హాయ ప‌డ‌తుంది. క‌నుక రోజూ ఒక క్యారెట్‌ను తినాలి. లేదా ఒక క‌ప్పు క్యారెట్ జ్యూస్‌ను తాగాలి. దీంతో వీర్య క‌ణాల సంఖ్య‌ను పెంచుకోవ‌చ్చు.

7. వాల్ న‌ట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని రోజూ తీసుకుంటే స్పెర్మ్ కౌంట్‌ను పెంచుకోవ‌చ్చు.

8. ఇవే కాకుండా ముదురు ఆకుపచ్చ కూరలు, అవకాడోలు, తృణధాన్యాలు, స్ట్రాబెర్రీలు, నిమ్మ, మోసంబి, టమోటాలు, కివీ పండ్లు, వెన్న, గుడ్లు, పాలు, మీగడ, బచ్చలి కూర, జింక్ అధికంగా ఉండే నువ్వులు, పొద్దు తిరుగుడు గింజలు, అల్లం, గోధుమ గడ్డి, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ‌ గింజలు, సెలీనియం ఉండే మ‌టన్ లివ‌ర్‌, చేపలు, రొయ్యలు, పీతలు వంటి ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల కూడా వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది.

ఇక వీర్య క‌ణాల సంఖ్య పెర‌గాలంటే రోజూ వ్యాయామం చేయాలి. వేళ‌కు పౌష్టికాహారం తీసుకోవాలి. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గించుకోవాలి. కంప్యూట‌ర్ల ఎదుట ప‌నిచేసేవారు మ‌ధ్య మ‌ధ్య‌లో విరామం ఇవ్వాలి. సెల్‌ఫోన్లు, కంప్యూట‌ర్ల వాడ‌కాన్ని త‌గ్గించాలి. ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో వీలైనంత ఎక్కువ సేపు గ‌డ‌పాలి.

మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం వ‌ల్ల కూడా స్పెర్మ్ కౌంట్ త‌గ్గుతుంది. క‌నుక ఆ అల‌వాట్ల‌ను మానేయాలి. ఇక‌ ఆపిల్, బెర్రీస్, పియర్స్, ద్రాక్ష‌, ఖ‌ర్జూరాలు, జామ, మామిడి, పైనాపిల్ వంటి పండ్ల‌ను త‌ర‌చూ తీసుకోవాలి. రోజూ త‌గినంత నీటిని తాగాలి. క‌నీసం 6-8 గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. ఇన్ని జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ ఆయా ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వీర్య క‌ణాల సంఖ్య‌ను పెంచుకోవ‌చ్చు.

Admin

Recent Posts