పాలను తాగడం వల్ల మనకు ఎన్నో రకాల ఉపయోగాలు కలుగుతాయి. పాలు సంపూర్ణ పౌష్టికాహారం. వాటిలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. అందువల్లే వాటిని సంపూర్ణ పౌష్టికాహారం అని పిలుస్తారు. అయితే వీటిని కొందరు శాకాహారంగా భావిస్తారు, కొందరు మాంసాహారమని అంటారు. నిజానికి అసలు పాలు శాకాహారమా ? మాంసాహారమా ? అన్న విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే..
గేదెలు, ఆవుల నుంచి పాలు వస్తాయి. అవి జంవుతులు. కనుక పాలు కూడా మాంసాహారమే అని కొందరు అంటారు. అయితే ఇదే విషయాన్ని తీసుకుంటే పాలను తాగేవారు అందరూ మాంసాహారులే అవుతారు. అలాగే తల్లిపాలు వృక్షాల నుంచి రావు. మనిషి అనే జీవి నుంచే వస్తాయి. అందువల్ల వాటిని కూడా మాంసాహారం అనాల్సి వస్తుంది. దీంతో ప్రపంచంలోని అందరూ మాంసాహారులే అవుతారు. అయితే ఈ వాదన తప్పు. కనుక పాలను శాకాహారంగా భావించవచ్చు.
ఇక ఇంకో వివరణ చూస్తే.. ఆవులు, గేదెలు, ఇతర జంతువుల మలాన్ని సేంద్రీయ ఎరువుగా పంటలను పండించేందుకు ఉపయోగిస్తారు. అనేక రకాల పండ్లు, కూరగాయలు పండుతాయి. జంతువుల నుంచి వచ్చే అన్నీ మాంసాహారమే అని భావిస్తే ఎరువు, దాంతో పండే పండ్లు, కూరగాయలు కూడా మాంసాహారంగానే పరిగణించాల్సి వస్తుంది. ఈ వాదన కూడా నిజానికి తప్పే. కనుక పాలను శాకాహారంగానే భావించాల్సి ఉంటుంది. అయినప్పటికీ దీనిపై ఎప్పటికప్పుడు వాదనలు జరుగుతూనే ఉంటాయి. కొందరు ఇంకా పాలను మాంసాహారంగానే భావిస్తున్నారు. కొందరు శాకాహారమనే అంటున్నారు. కానీ మాంసం అంటే జంతువులను చంపడం ద్వారా వచ్చేది. పాలు అలా రావు. కనుక అవి శాకాహారమా, మాంసాహారమా అని నిర్దారించుకోవాల్సింది ప్రజలే. ఎవరికి వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక దీనిపై వాదించాల్సిన పనికూడా లేదు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365