Lungs Health : అసలే కరోనా సమయం. ఇలాంటి సమయంలో మన ఊపిరితిత్తులను చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవాలి. కరోనా మన ఊపిరితిత్తులపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఊపిరితిత్తులను దెబ్బ తీస్తుంది. కనుక ఊపిరితిత్తులను దృఢంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఊపిరితిత్తులు దృఢంగా ఉంటే కరోనా మనల్ని ఏమీ చేయదు. స్వల్ప లక్షణాలతో మనకు అది వచ్చి పోతుంది.
అయితే ప్రస్తుతం అనేక కారణాల వల్ల చాలా మందికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. కాలుష్యం, పొగ తాగడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఊపిరితిత్తులను బలహీనంగా మార్చేస్తాయి. దీంతోపాటు గాలిలో ఉండే విష పదార్థాలు, కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీంతో ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, పల్మనరీ ఫైబ్రోసిస్ వంటి వ్యాధులు వస్తుంటాయి. అయితే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకునేందుకు మనం రోజూ కింద తెలిపిన ఆహారాలను తీసుకోవాలి. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. కరోనా నుంచి సురక్షితంగా ఉండవచ్చు.
1. వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచేందుకు యాపిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. రోజుకు ఒక యాపిల్ పండును తింటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. అది నిజమే. రోజుకో యాపిల్ పండును తింటే ఊపిరితిత్తులు దృఢంగా మారుతాయి. యాపిల్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి ఆస్తమా, లంగ్ క్యాన్సర్ వచ్చే ముప్పును తగ్గిస్తాయి. అధ్యయనాల ప్రకారం.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక యాపిల్ పండును తినాల్సి ఉంటుంది. దీంతో ఊపిరితిత్తులు బలంగా మారుతాయి. కరోనాను తట్టుకునే శక్తి లభిస్తుంది.
2. గుమ్మడికాయ విత్తనాల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. వాటిల్లో కెరోటినాయిడ్స్, లుటీన్, జియాజాంతిన్ ఉంటాయి. ఇవి వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం.. గుమ్మడికాయ విత్తనాలను రోజూ గుప్పెడు మోతాదులో తినడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అవి దృఢంగా మారుతాయి.
3. ఊపిరితిత్తులు కొందరిలో వాపులకు గురవుతాయి. దీంతో అవి సరిగ్గా పనిచేయవు. కరోనా వచ్చిన వారిలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పసుపును తీసుకోవడం వల్ల వాపులు తగ్గుతాయి. పసుపులో ఉండే కర్‌క్యుమిన్ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ పదార్థంగా పనిచేస్తుంది. దీంతో వాపులు తగ్గుతాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
4. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి గ్రీన్ టీ కూడా ఎంతగానో మేలు చేస్తుంది. గ్రీన్ టీలో ఉండే ఈజీసీజీ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. దీని వల్ల ఊపిరితిత్తుల కణజాలం రక్షించబడుతుంది. ఊపిరితిత్తుల కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి. దీంతో పల్మనరీ ఫైబ్రోసిస్ వంటి వ్యాధులు రాకుండా ఊపిరితిత్తులను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
5. పప్పు దినుసులు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిల్లో మెగ్నిషియం, ఐరన్, రాగి, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్, సీవోపీడీ వంటి వ్యాధులను రాకుండా రక్షిస్తాయి. దీని వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.