Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Featured

ఈయ‌న వ‌య‌స్సు 75 ఏళ్లు.. అయినా కేవ‌లం 3 గంట‌ల్లోనే 40 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కాడు..!

Admin by Admin
September 7, 2021
in Featured, ఆరోగ్యం
Share on FacebookShare on Twitter

వ‌య‌స్సు అనేది కేవ‌లం శ‌రీరానికి మాత్ర‌మే, మ‌న‌స్సుకు కాదు. మ‌న‌స్సు ఉంటే మార్గం ఉంటుంది. ఏ వ‌య‌స్సులో ఉన్న వారు అయినా ఎంత సేపైనా వ్యాయామం చేయ‌వచ్చు. అవును.. స‌రిగ్గా ఇదే విష‌యాన్ని ఆయ‌న నిరూపిస్తున్నారు. ఆయ‌నే హైద‌రాబాద్‌కు చెందిన పాండే.

ఈయ‌న వ‌య‌స్సు 75 ఏళ్లు.. అయినా కేవ‌లం 3 గంట‌ల్లోనే 40 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కాడు..!

పాండే వ‌య‌స్సు 75 ఏళ్లు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఫిట్‌నెస్, వ్యాయామం విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌రు. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా నిర్వ‌హించిన సైకిల్ రైడ్ పోటీల్లో ఆయ‌న పాల్గొని కేవ‌లం 3 గంట‌ల్లోనే 40 కిలోమీట‌ర్ల దూరం సైకిల్ తొక్కి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

స‌ఫిల్ గూడ పార్క్ నుంచి మొద‌లైన ఆయ‌న సైకిల్ రైడ్ చార్మినార్ వ‌ద్ద ముగిసింది. ఇందుకు కేవ‌లం 1 గంట మాత్ర‌మే స‌మ‌యం ప‌ట్టింది. ఇక రిట‌ర్న్ వ‌చ్చేట‌ప్పుడు నెక్లెస్ రోడ్డు మీదుగా వ‌చ్చారు. ఇందుకు 2 గంట‌ల స‌మ‌యం తీసుకుంది. మొత్తంగా 3 గంట‌ల్లో ఆయ‌న 40 కిలోమీట‌ర్ల దూరం సైకిల్ తొక్కారు.

అయితే సైకిల్ తొక్క‌డం పాండేకు కొత్తేమీ కాదు. అది ఆయ‌న దిన‌చ‌ర్య‌లో ఒక భాగ‌మే. రోజుకు సుమారుగా 40 నిమిషాల పాటు సైకిల్ తొక్కుతారు. 6-7 కిలోమీట‌ర్ల దూరం వాకింగ్ చేస్తారు. ఆయ‌న‌కు గ‌తంలో మోకాలు కీళ్ల మార్పిడి శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఈ విధంగా వ్యాయామం చేస్తుండ‌డం విశేషం. ఇక ఆయ‌న రోజూ 7 నుంచి 10 త‌ర‌గ‌తి చ‌దివే పేద విద్యార్థుల‌కు పాఠాలు చెబుతుంటారు. రైల్వేలో ఇంజినీర్‌గా ఎన్నో రోజులు ప‌నిచేసిన ఈయ‌న రిటైర్ అయ్యాక ఈ విధంగా పేద‌ల‌కు స‌హాయం చేస్తున్నారు. అంతే కాదు, ఫిట్ నెస్ విష‌యంలో త‌న‌కు సాటి ఎవ‌రూ లేర‌ని నిరూపిస్తున్నారు.

Tags: exercisefitnesshealthy life storieshyderabadpandeపాండేఫిట్ నెస్వ్యాయామంహైద‌రాబాద్‌
Previous Post

కేర‌ళ‌లో విజృంభిస్తున్న నిపా వైర‌స్.. దీనికి, క‌రోనా వైర‌స్‌కు మ‌ధ్య ఉన్న తేడాలు ఏమిటి ?

Next Post

ప‌ర‌గ‌డుపున ఇలా చేస్తే జ‌న్మ‌లో గ్యాస్ ట్ర‌బుల్ రాదు..!

Related Posts

ఆరోగ్యం

Daily One Carrot : ఈ 10 కార‌ణాలు తెలిస్తే క్యారెట్ల‌ను రోజూ తింటారు..!

December 14, 2023
Featured

Vegan Diet : పూర్వ‌కాలంలో రుషులు తిన్న ఆహారం ఇది.. ఇలా తింటే మ‌న‌కు ఎలాంటి రోగాలు రావు..!

April 24, 2022
Featured

Diabetes : షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగేది ఇందుకే.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన సీక్రెట్‌..!

March 29, 2022
Featured

Finger : కాలి బొట‌న‌వేలి క‌న్నా చూపుడు వేలు పొడ‌వుగా ఉంటే మ‌హిళ‌లు త‌మ భ‌ర్త‌ల‌ను ఆటాడిస్తారా ?

March 18, 2022
Featured

Chanakya Tips : ఆఫీస్ రాజ‌కీయాల్లో బ‌లి కాకుండా ఉండాలంటే.. ఉద్యోగులు ఈ చాణ‌క్య సూత్రాల‌ను పాటించాలి..!

March 4, 2022
Featured

Useful Trick : విప‌త్క‌ర ప‌రిస్థితిలో ప‌నిచేసే ట్రిక్ ఇది.. మ‌హిళ‌ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది..!

March 1, 2022

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.