Categories: Featured

విటమిన్ డి గర్భిణీలకు చాలా ముఖ్యం.. లేదంటే పిల్లలకు ఈ సమస్యలు వస్తాయి.

గర్భం ధరించిన మహిళలు తమ ఆరోగ్యం పట్ల మిక్కిలి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పురుషుల కన్నా స్త్రీల శరీరాలు వేరేగా ఉంటాయి. అందువల్ల వారు ఆరోగ్యం పట్ల ఇంకా ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. అదే గర్భంతో ఉన్న మహిళలు అయితే ఆరోగ్యం పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. నిత్యం పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో పుట్టబోయే పిల్లలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే కొందరు గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. కానీ అలా చేయకూడదు.

vitamin d is very important for pregnant woman know the reason

గర్భం ధరించిన మహిళలు సరైన పౌష్టికాహారం తీసుకోకపోతే ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద పడుతుంది. ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళలు చాలా మందిలో విటమిన్‌ డి లోపం సమస్య వస్తుంటుంది. దీంతో పుట్టబోయే చిన్నారులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. గర్భంతో ఉన్న మహిళలు విటమిన్‌ డి ని రోజూ తగిన మోతాదులో అందే విధంగా చూసుకోవాలి. లేదంటే పుట్టబోయే పిల్లల్లో అధిక బరువు, స్థూలకాయం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే అలాంటి చిన్నారులు ఆరేళ్ల వయస్సు వచ్చే సరికి వారి నడుం చుట్టుకొలత బాగా పెరుగుతుందని అంటున్నారు.

విటమిన్‌ డి లోపం వల్ల గుండె జబ్బులు, మల్టిపుల్‌ స్లెరోసిస్‌ వంటి సమస్యలు చిన్నారుల్లో వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే క్యాన్సర్‌, టైప్‌ 1 డయాబెటిస్‌ వచ్చేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది మహిళల్లో విటమిన్‌ డి లోపం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక విటమిన్‌ డి 95 శాతం వరకు సూర్యరశ్మి నుంచే పొందవచ్చు. రోజూ ఉదయాన్నే కనీసం 30 నిమిషాల పాటు ఎండలో ఉండడం వల్ల మన శరీరం విటమిన్‌ డి ని తయారు చేసుకుంటుంది. దీంతోపాటు కోడిగుడ్లు, చేపలు, ఫిష్‌ లివర్‌ ఆయిల్‌, పాలు, చీజ్‌, పెరుగు, తృణ ధాన్యాలలో విటమిన్‌ డి లభిస్తుంది.

మన దేశంలో సుమారుగా 66 శాతం మంది మహిళలు విటమిన్‌ డి లోపం సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా గర్భిణీలు 3 నెలల గర్భం అనంతరం ఈ సమస్యతో బాధపడుతున్నారని వెల్లడైంది. అందువల్ల విటమిన్‌ డి ఉన్న ఆహారాలను వారు తీసుకోవాలి. దీంతోపాటు డాక్టర్లు సూచించిన మేర విటమిన్‌ డి ట్యాబ్లెట్లను కూడా వాడాల్సి ఉంటుంది. దీని వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

Admin

Recent Posts