జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు అనేక చిట్కాలు పాటిస్తున్నా ఏవీ వర్కవుట్ అవడం లేదా ? ఈ సమస్యకు అసలు పరిష్కారం దొరకడం లేదా ? అయితే అసలు చింతించకండి. ఎందుకంటే ఆ సమస్యకు విటమిన్ E చక్కని పరిష్కారం చూపుతుంది. ఈ పోషక పదార్థం వెంట్రుకల సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ గనుక జుట్టును రిపేర్ చేసి, వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది. అలాగే జుట్టు కుదుళ్ల వద్దకు రక్తాన్ని సరఫరా చేసి జుట్టుకు తేమనిస్తుంది. దీంతోపాటు వెంట్రుకలు చిట్లకుండా ఉంటాయి. విటమిన్ E సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాల బారి నుంచి జుట్టును సంరక్షిస్తుంది.
జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడం అనే సమస్యను తగ్గించడానికి, ఇతర వెంట్రుకల సమస్యలకు.. విటమిన్ E ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆరోగ్యవంతమైన కుదుళ్లకు
జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటేనే జుట్టు బాగా పెరుగుతుంది. ఇందుకు విటమిన్ E ఎంతగానో దోహదపడుతుంది. ఇది జుట్టు కుదుళ్లను సంరక్షిస్తుంది. వాటికి పోషణనిస్తుంది. విటమిన్ E యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతుంది కనుక ఇది ఒత్తిడి వల్ల జుట్టుకు కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. దీంతో కుదుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు పెరుగుతుంది.
2. హెయిర్ ఫాల్‌కు
జుట్టు రాలడాన్ని తగ్గించే గుణాలు విటమిన్ E లో ఉన్నాయి. నిరంతరాయంగా విటమిన్ E ని తీసుకుంటే జుట్టు రాలడం ఆటోమేటిగ్గా తగ్గుతుంది. అలాగే జుట్టు పెరుగుతుంది. సైంటిస్టులు చేసిన పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
3. పీహెచ్ స్థాయిలు, మృదుత్వం
జుట్టు రాలడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. ఒకటి కుదుళ్లలో సరైన పీహెచ్ బ్యాలెన్స్ లేకపోవడం. రెండోటి.. సహజసిద్ధమైన నూనె ఉత్పత్తి కాకపోవడం. అయితే విటమిన్ E ఈ రెండు సమస్యలను పరిష్కరిస్తుంది. ఇది కుదుళ్లపై ఓ సురక్షితమైన పొరను ఏర్పాటు చేస్తుంది. దీంతో సహజసిద్ధమైన నూనె ఉత్పత్తి అయి జుట్టుకు తేమ అందుతుంది. ఈ క్రమంలో వెంట్రుకలు మృదువుగా మారుతాయి. అలాగే కుదుళ్లలో పీహెచ్ స్థాయిలు కూడా బ్యాలెన్స్ అవుతాయి.
4. ఆరోగ్యమైన శిరోజాలు
శిరోజాలు మృదువుగా, కాంతివంతంగా ఉండాలని మహిళలు కోరుకుంటారు. అందుకు విటమిన్ E తోడ్పడుతుంది. ఇది శిరోజాల బయటి పొరకు రక్షణ ఇస్తుంది. దీంతో వెంట్రుకలు కాంతివంతంగా కనిపిస్తాయి. అలాగే నిరంతరాయంగా విటమిన్ E ని తీసుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.
విటమిన్ E ని ఎలా తీసుకోవాలి ?
వెంట్రుకల సమస్యలను పరిష్కరించుకునేందుకు విటమిన్ E ని అనేక రకాలుగా తీసుకోవచ్చు. విటమిన్ E ఆయిల్ మార్కెట్లో లభిస్తుంది. దీన్ని వాడవచ్చు. లేదా విటమిన్ E సప్లిమెంట్లు లభిస్తాయి. వాటిని కూడా వాడుకోవచ్చు. ఇక విటమిన్ E ఆయిల్‌ను అవకాడో లేదా ఆముదం నూనెతో కలిపి వాడితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది. వీటితోపాటు విటమిన్ ఇ ఉండే షాంపూ, హెయిర్ కండిషనర్, హెయిర్ ఆయిల్‌లను కూడా వాడుకోవచ్చు.
ఇక నిత్యం మనం ఆహారం ద్వారా కూడా విటమిన్ E మనకు అందేలా చూసుకోవచ్చు. అందుకు గాను పలు ఆహారాలను నిత్యం తీసుకోవాలి. దీంతో విటమిన్ E మనకు అందుతుంది. ఫలితంగా వెంట్రుకల సమస్యల నుంచి బయట పడవచ్చు. విటమిన్ E మనకు.. పొద్దు తిరుగుడు విత్తనాలు, బాదం పప్పు, పైన్ నట్స్, పిస్తా పప్పు, జీడిపప్పు, కివీ, మామిడి పండ్లు, అవకాడో, ఆప్రికాట్స్, బెర్రీలు, పాలకూర, బ్రొకొలి, ఇతర వెజిటబుల్ ఆయిల్స్‌లో.. లభిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా విటమిన్ E లభిస్తుంది. దీంతో జుట్టు సమస్యలు పరిష్కారం అవుతాయి.