Categories: Featured

డైటింగ్ పాటించేవారు, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు.. చేసే పొర‌పాట్లు ఇవే..!

అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి కామ‌న్ స‌మ‌స్య అయింది. అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది అనేక ర‌కాల ప‌ద్ధ‌తులు పాటిస్తున్నారు. ఇక చాలా మంది బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని, బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంద‌ని చెప్పి.. డైట్ పాటిస్తుంటారు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. వారు డైట్ పేరిట కొన్ని చిన్న‌పాటి త‌ప్పులు చేస్తుంటారు. వాటిని చేయ‌కుండా ఉంటే.. అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌డంతోపాటు.. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. మ‌రి డైటింగ్ చేసేట‌ప్పుడు ఎవ‌రైనా చేసే చిన్న‌పాటి మిస్టేక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

weight loss mistakes in telugu

* డైటింగ్ పేరిట కొంద‌రు తిండి పూర్తిగా త‌గ్గించేస్తారు. నిజానికి అలా చేయడం స‌రికాదు. నిత్యం మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన క్యాల‌రీల మేర ఆహారం తీసుకోవాలి. కానీ ఆహారాన్ని త‌గ్గించి తిన‌రాదు. కావాలంటే త‌క్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తిన‌వ‌చ్చు. అంతేకానీ.. డైట్ పేరిట నిత్యం కావ‌ల్సిన క్యాల‌రీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవ‌డంలోనూ కోత పాటించ‌కూడ‌దు.

* కొంద‌రు అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని చెప్పి ఒక పూట చాలా త‌క్కువ‌గా తింటారు. కానీ నిజానికి అలాంటి స్థితిలో చాలా మంది రెండో పూట తినాల్సిన దాని క‌న్నా ఎక్కువ‌గా తింటార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. క‌నుక పూట పూట‌కూ కావ‌ల్సిన మోతాదులో ఆహారాన్ని తీసుకోవాల్సిందే.

* బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి వ్యాయామం చేస్తుంటారు. అది క‌రెక్ట్ కాదు. అలా చేయ‌డం వ‌ల్ల కొన్ని సంద‌ర్భాల్లో ప్రాణాల మీద‌కే రావ‌చ్చు. క‌నుక నిత్యం స‌రిపోయిన మేర‌కే వ్యాయామం చేయాలి.

* అధిక బ‌రువు త‌గ్గిస్తాయ‌ని చెప్పి కొంద‌రు ఫుడ్ స‌ప్లిమెంట్లు, పిల్స్ వాడుతుంటారు. నిజానికి అవి మ‌న శ‌రీరానికి ఏమాత్రం మంచివి కావ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. వాటికి బ‌దులుగా పండ్లు, న‌ట్స్ వంటి వాటిని తింటే మంచిద‌ని సూచిస్తున్నారు.

* కొంద‌రు బ‌రువు పెరుగుతామేమోన‌న్న భ‌యంతో చ‌క్కెర‌, కొవ్వు ప‌దార్థాల‌ను తిన‌డం పూర్తిగా మానేస్తారు. కానీ ఆ ప‌దార్థాలు నిత్యం మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మే. అందువ‌ల్ల వాటిని నిత్యం ప‌రిమిత మోతాదులో తింటే ఏమీ కాదు.

* డైటింగ్ చేసేవారు, అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు మ‌ద్య‌పానం, ధూమ‌పానాల‌కు దూరంగా ఉండాలి. దీంతో బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

* డైటింగ్ చేస్తున్నామ‌ని చెప్పి కొంద‌రు షుగ‌ర్ ఫ్రీ టీ, కాఫీల‌ను తాగుతుంటారు. నిజానికి అవి కూడా మ‌న‌కు మంచివి కావు. వాటికి బ‌దులుగా చ‌క్కెర క‌ల‌ప‌కుండా తాజా పండ్ల జ్యూస్‌ను తయారు చేసుకుని తాగితే మంచిది.

* డైటింగ్ చేసే కొంద‌రు ప్రోటీన్ షేక్‌ల‌ను తాగుతారు. అవి మ‌న శ‌రీరానికి మంచివే అయినా.. వ్యాయామం ఎక్కువ‌గా చేసేవారికి అవి మేలు చేస్తాయి. సాధార‌ణ వ్యాయామం చేసే వారు వాటిని తాగాల్సిన ప‌నిలేదు. బాడీ బిల్డింగ్ చేసేవారు, సిక్స్ ప్యాక్ కావాల‌నుకునే వారు వాటిని తాగ‌వ‌చ్చు.

* నిత్యం వ్యాయామం చేస్తూ.. డైట్ పాటిస్తున్నాం క‌దా అని చెప్పి కొంద‌రు నిద్ర స‌రిగ్గా పోరు. కానీ బ‌రువు త‌గ్గాలంటే నిత్యం త‌గిన మోతాదులో నిద్ర కూడా అవ‌స‌ర‌మే. క‌నుక ఎవ‌రైనా స‌రే.. నిత్యం క‌నీసం 6 గంట‌లైనా నిద్ర‌పోవాలి. అప్పుడే చేస్తున్న డైటింగ్‌కు ఫ‌లితం ల‌భిస్తుంది.

Admin

Recent Posts