Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Featured

దోమలకు ఏ వాసనలు నచ్చవో తెలుసా..? దోమలను ఆకర్షించేవి ఇవే..!

Admin by Admin
June 9, 2021
in Featured
Share on FacebookShare on Twitter

ఏ సీజన్‌ వచ్చినా సరే.. సహజంగానే మనల్ని దోమలు మాత్రం విడిచిపెట్టవు. ఆదమరిచి ఉంటే అమాంతం కుట్టేస్తాయి. రక్తాన్ని పీలుస్తాయి. అయితే నిజానికి దోమలకు కొన్నిరకాల వాసనలు అంటే పడవు. కొన్ని పదార్థాలు దోమలను ఆకర్షిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

what attracts mosquitoes and what keeps away them

1. వెల్లుల్లి వాసన అంటే దోమలకు అస్సలు పడదు. కనుక వెల్లుల్లి రసాన్ని తీసి నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి రూమ్‌లో స్ప్రే చేసుకోవాలి. లేదా వెల్లుల్లి రసాన్ని శరీరానికి రాసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలను కూడా తినవచ్చు. దీంతో దోమలు దగ్గరికి కూడా రావు.

2. తులసి ఆకుల వాసన కూడా దోమలకు పడదు. తులసి ఆకుల నూనె మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. దాన్ని శరీరానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది.

3. పుదీనా మనకు తాజాదనాన్ని అందిస్తుంది. కానీ దోమలకు ఈ వాసన నచ్చదు. కనుక పుదీనా నూనెను ఉపయోగించడం వల్ల కూడా దోమల బెడద నుంచి బయట పడవచ్చు.

4. లెమన్‌ గ్రాస్‌ ఆయిల్‌ కూడా దోమలను దూరంగా ఉంచుతుంది. దీన్ని కూడా ఉపయోగించవచ్చు.

5. దోమలను తరిమికొట్టడంలో వేపాకులు, వేప నూనె అద్భుతంగా పనిచేస్తాయి. ఇంట్లో వేపాకుల పొగ వేయాలి. లేదా శరీరానికి వేప నూనె రాయాలి. వేప నూనెను స్ప్రే కూడా చేయవచ్చు. దీంతో దోమలు తోక ముడుస్తాయి.

ఇక దోమలు వేటికి ఆకర్షితమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒక మనిషిని దోమలు ఆకర్షించేందుకు అతని జన్యువులు కారణమవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. అంటే ఒక వ్యక్తిని దోమలు బాగా కుడితే అతనికి పుట్టే పిల్లలను కూడా దోమలు ఎక్కువగా కుట్టేందుకు 85 శాతం వరకు అవకాశాలు ఉంటాయి. దీన్ని సైంటిస్టులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు.

2. మనం వదిలే కార్బన్‌ డయాక్సైడ్‌కు కూడా దోమలు ఆకర్షితమవుతాయి.

3. కొన్ని రకాల పెర్‌ఫ్యూమ్‌లు, డియోడరెంట్‌లు కూడా దోమలను ఆకర్షిస్తాయి.

4. O గ్రూప్‌ రక్తం ఉన్న వారిని దోమలు బాగా కుడతాయి.

5. మన శరీరం విడుదల చేసే చెమటకు కూడా దోమలు మన పట్ల ఆకర్షితమవుతాయి.

వదులుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల దోమలు కుట్టడాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే లైట్‌ కలర్‌ దుస్తులను ధరించాలి. డార్క్‌ కలర్‌ వస్తువులకు కూడా దోమలు ఆకర్షితమవుతాయి. కనుక డార్క్‌ కలర్‌ దుస్తులను ధరించరాదు. దోమలు సాధారణంగా సాయంత్రం 4 గంటల తరువాత కుడతాయి. అందువల్ల ఆ సమయంలో ఇంట్లోకి దోమలను రాకుండా చూసుకోవాలి. అలాగే ఆ సమయంలో బయట ఉంటే దోమలు కుట్టకుండా జాగ్రత్తలు వహించాలి. దీంతో దోమలు మనల్ని కుట్టకుండా చూసుకోవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: mosquitoesదోమ‌లు
Previous Post

చిక్కిపోయి నీర‌సంగా మారుతున్న‌వారు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

Next Post

వివిధ రకాల టీలు.. వాటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..!

Related Posts

Featured

Vegan Diet : పూర్వ‌కాలంలో రుషులు తిన్న ఆహారం ఇది.. ఇలా తింటే మ‌న‌కు ఎలాంటి రోగాలు రావు..!

April 24, 2022
Featured

Diabetes : షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగేది ఇందుకే.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన సీక్రెట్‌..!

March 29, 2022
Featured

Finger : కాలి బొట‌న‌వేలి క‌న్నా చూపుడు వేలు పొడ‌వుగా ఉంటే మ‌హిళ‌లు త‌మ భ‌ర్త‌ల‌ను ఆటాడిస్తారా ?

March 18, 2022
Featured

Chanakya Tips : ఆఫీస్ రాజ‌కీయాల్లో బ‌లి కాకుండా ఉండాలంటే.. ఉద్యోగులు ఈ చాణ‌క్య సూత్రాల‌ను పాటించాలి..!

March 4, 2022
Featured

Useful Trick : విప‌త్క‌ర ప‌రిస్థితిలో ప‌నిచేసే ట్రిక్ ఇది.. మ‌హిళ‌ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది..!

March 1, 2022
Featured

Japan People : జ‌పాన్ దేశ‌వాసులు అంత స‌న్న‌గా ఎందుకు ఉంటారో తెలుసా ? వారి ఆరోగ్య ర‌హ‌స్యాలు ఏమిటి ?

March 1, 2022

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!