Biscuits : బిస్కెట్లు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎవరి ఇంటికి అయినా వెళితే.. ముందుగా వారు అతిథులకు ఇచ్చేవి బిస్కెట్లే. దాంతోపాటు టీ, కాఫీ వంటివి ఇస్తారు. ఇక చిన్నారులు అయితే బిస్కెట్లను ఎంతో ఇష్టంగా తింటారు. బిస్కెట్లలో అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల బిస్కెట్లలో రంధ్రాలు ఉంటాయి. గమనించే ఉంటారు, మరి ఈ రంధ్రాలను ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా ? అదే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

బిస్కెట్ల తయారీ సమయంలో పిండిని బేకింగ్ యంత్రంలోకి పంపించకముందే ఒక ప్రత్యేక మెషిన్ సహాయంతో వాటిపై రంధ్రాలు చేస్తారు. ఇలా రంధ్రాలు చేయడం వల్ల బిస్కెట్ మరీ ఎక్కువ సైజ్‌కు విస్తరించకుండా ఉంటుంది. లేదంటే బిస్కెట్ మరీ ఎక్కువగా బేక్ అయి ఉబ్బిపోయినట్లు కనిపిస్తుంది. దీన్ని నివారించేందుకే బిస్కెట్లలో రంధ్రాలు చేస్తారు.
ఆ రంధ్రాలన్నీ ఒకే సైజ్ లో ఒకే వరుసలో ఉండేలా చూస్తారు. అందుకు గాను రంధ్రాలు చేసే మెషిన్ ఉపయోగపడుతుంది. ఇక రంధ్రాలను చేశాక బిస్కెట్లు బేకింగ్‌కు వెళ్తాయి. అక్కడ రంధ్రాల మధ్య నుంచి గాలి బయటకు పోతుంది. దీంతో బిస్కెట్లు మరీ ఓవర్‌గా ఉబ్బిపోకుండా ఉంటాయి. దీంతో అన్ని బిస్కెట్లు సరైన సైజ్‌లో బేక్ అవుతాయి. సరిగ్గా ఇందుకోసమే బిస్కెట్లలో రంధ్రాలను ఏర్పాటు చేస్తుంటారు.
ఇక ఈ రంధ్రాలను డాకర్ హోల్స్ అని పిలుస్తారు. ఈ రంధ్రాలు అన్ని బిస్కెట్లకు ఉండవు. కొన్ని రకాల క్రీమ్ బిస్కెట్లు, సాల్ట్ బిస్కెట్లపై మాత్రమే మనకు కనిపిస్తాయి. అవి కచ్చితమైన సైజ్‌లో బేక్ అయ్యేందుకు రంధ్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకనే బిస్కెట్లను బేక్ చేసేముందు వాటికి రంధ్రాలు చేస్తారు.