Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Bonda : ఆలు బొండాల‌ను ఇలా చేశారంటే.. అప్పటికప్పుడు స్నాక్స్, టిఫిన్ లోకి వేడివేడిగా తిన‌వ‌చ్చు..

D by D
May 18, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Bonda : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద, హోటల్స్ ల‌భించే చిరుతిళ్లల్లో ఆలూ బోండాలు కూడా ఒక‌టి. ఆలూ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మ‌నలో చాలా మంది ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ ఆలూ బోండాల‌ను మ‌నం కూడా చాలా సుల‌భంగా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా ఉండే ఈ ఆలూ బోండాల‌ను రుచిగా ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ బోండా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, బియ్యం పిండి – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, నీళ్లు – ఒక క‌ప్పు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, వంట‌సోడా – పావు టీ స్పూన్, వేడి నూనె – 2 టీ స్పూన్స్.

Aloo Bonda recipe in telugu tasty snacks and breakfast
Aloo Bonda

ఆలూ స్ట‌ఫింగ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – 3 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), ప‌చ్చిమిర్చి – 3, అల్లం – అర అంగుళం ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, ధ‌నియాలు – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం- అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి లేదా చాట్ మ‌సాలా – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

ఆలూ బోండా త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో బియ్యంపిండి, ప‌సుపు, ఉప్పు, కారం, వాము వేసి క‌ల‌పాలి. త‌రువాత కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ పిండిని క‌లుపుకోవాలి. పిండి మ‌రీ ప‌లుచ‌గా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి పిండిని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత బంగాళాదుంప‌ల‌పై ఉండే పొట్టును తీసేసి మ‌రీ మెత్త‌గా కాకుండా అక్క‌డ‌క్క‌డ బంగాళాదుంప ముక్క‌లు ఉండేలా మెదుపుకోవాలి. త‌రువాత జార్ లో ప‌చ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, ధ‌నియాలు వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చిమిశ్రం, ఇంగువ వేసి క‌ల‌పాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత బంగాళాదుంప మిశ్ర‌మం, ఉప్పు, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడిఆమ్ చూర్ పొడి వేసి క‌ల‌పాలి. బంగాళాదుంప‌ల్లో ఉండే నీరంతా పోయి ద‌గ్గ‌ర పడే వ‌ర‌కు వేయించిన త‌రువాత కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బంగాళాదుంప మిశ్ర‌మం చ‌ల్లారిన త‌రువాత ఉండలుగా చేసి పెట్టుకోవాలి. త‌రువాత ముందుగా క‌లిపి పెట్టుకున్న పిండిలో వంట‌సోడా, వేడినూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మ‌ధ్య‌స్థంగా వేడ‌య్యాక బంగాళాదుంప ఉండ‌ల‌ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి.

చేత్తో వేసుకోవ‌డం రాని వారు స్పూన్ తో కూడా వీటిని సుల‌భంగా వేసుకోవచ్చు. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే ఆలూ బోండాలు త‌యార‌వుతాయి. వీటిని వెల్లుల్లి కారం, గ్రీన్ చ‌ట్నీ, ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా ఈ బోండాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Aloo Bonda
Previous Post

Papaya : బొప్పాయిని తింటున్నారా.. అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Next Post

Fish Curry : ఏ చేపతో అయినా స‌రే.. ఇలా పులుసు పెట్టారంటే చాలా రుచిగా వస్తుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.