Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Gobi Masala Curry : ఆలు గోబీ మ‌సాలా కూర‌.. పూరీలు, చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
February 23, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Gobi Masala Curry : మ‌నం క్యాలీప్ల‌వ‌ర్ తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో ఆలూ గోబి మ‌సాలా కూర కూడా ఒక‌టి. క్యాలీప్ల‌వ‌ర్, బంగాళాదుంప‌లు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఈ ఆలూ గోబి మ‌సాలా కూర‌ను మ‌నం మ‌రింత రుచిగా ధాబాల్లో ల‌భించే విధంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బంగాళాదుంప‌లు – 200 గ్రా., పెద్ద ముక్క‌లుగా త‌రిగిన క్యాలీప్ల‌వ‌ర్ – 1 ( చిన్న‌ది), నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, పెద్ద ట‌మాటాలు – 3, నీళ్లు – 150 ఎమ్ ఎల్, బ‌ట‌ర్ – 2 టీ స్పూన్, క్రీమ్ – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.

Aloo Gobi Masala Curry recipe in telugu make in this method
Aloo Gobi Masala Curry

ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీ తయారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో రెండు లీటర్ల నీటిని తీసుకుని వేడి చేయాలి. ఇందులో ప‌సుపు, బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిని 80 శాతం వ‌ర‌కు మెత్త‌గా ఉడికించాలి. త‌రువాత వీటిని తీసి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు అదే నీటిలో క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు వేసి ఉడికించాలి. ఈ ముక్క‌ల‌ను కూడా 80 శాతం వ‌ర‌కు ఉడికించి ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కారం, ఉప్పు, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి, ప‌సుపు వేసి క‌ల‌పాలి.

వీటిని ఒక నిమిషం పాటు వేయించుకున్న త‌రువాత ట‌మాటాలను పేస్ట్ గా చేసి వేసుకుని అంతా క‌లిసేలా క‌ల‌పాలి. త‌రువాత ఈ పేస్ట్ ను నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన బంగాళాదుంప ముక్క‌లు, క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను పూర్తిగా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత బ‌ట‌ర్, క్రీమ్ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కొత్తిమీర వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. చ‌పాతీ, పూరీ, రోటి, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Aloo Gobi Masala Curry
Previous Post

Sugar Patients Diet : షుగ‌ర్ పేషెంట్స్ ఎప్ప‌టికీ తిన‌కూడ‌ని ఆహారాలు ఇవే..!

Next Post

Lemon With Turmeric : నిమ్మ‌ర‌సం, ప‌సుపు ఇలా క‌లిపి రోజూ తీసుకుంటే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025
పోష‌ణ‌

మీ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే వీటిని తీసుకోండి..!

July 3, 2025
చిట్కాలు

ప‌సుపు రంగులోకి మారిన మీ దంతాలు మళ్లీ తెల్ల‌గా మారాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.