Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Meal Maker Masala Fry : ఆలూ మీల్ మేకర్ మసాలా ఫ్రై.. రైస్, చపాతీల‌లో క‌లిపి తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
April 13, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Meal Maker Masala Fry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ మీల్ మేక‌ర్ మ‌సాలా ఫ్రై కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు, మీల్ మేక‌ర్ క‌లిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో ఈ ఫ్రైను క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. రుచిగా, తేలిక‌గా చేసుకోగ‌లిగే ఆలూ మీల్ మేక‌ర్ మ‌సాలా ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ మీల్ మేక‌ర్ మ‌సాలా ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యూబ్స్ లాగా త‌రిగిన బంగాళాదుంప‌లు – పావు కిలో, మీల్ మేక‌ర్ – ఒక క‌ప్పు, పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Aloo Meal Maker Masala Fry recipe in telugu very tasty with rice
Aloo Meal Maker Masala Fry

ఆలూ మీల్ మేక‌ర్ మ‌సాలా ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా మీల్ మేక‌ర్ ల‌ను 5 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచాలి. త‌రువాత వాటిని చేత్తో పిండి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ వేయించాలి. బంగాళాదుంప ముక్క‌లు గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ లోకి రాగానే వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో మీల్ మేక‌ర్ వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ఉప్పు, కారం, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. మ‌సాలాల‌న్నీ చ‌క్క‌గా వేగిన త‌రువాత రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన మీల్ మేక‌ర్, బంగాళాదుంప ముక్క‌లు, ప‌సుపు, కొత్తిమీర‌, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మీల్ మేక‌ర్ మ‌సాలా ఫ్రై త‌యార‌వుతుంది. సైడ్ డిష్ గా తిన‌డానికి ఈ ఫ్రై చ‌క్క‌గా ఉంటుంది. ఒక్క ముక్క కూడా విడిచి పెట్ట‌కుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు.

Tags: Aloo Meal Maker Masala Fry
Previous Post

Flaxseeds Powder For Belly Fat : చిటికెడు తింటే చాలు.. మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మంచులా కరిగి పోతుంది..

Next Post

Makhana : వీటిని ఎప్పుడైనా తిన్నారా.. వీటి ర‌హ‌స్యం తెలిస్తే వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.