Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Methi Masala Curry : ఆలు మేథీ మ‌సాలా క‌ర్రీ ఇలా చేయండి.. అన్నం, చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
February 9, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Methi Masala Curry : ఆలూ మేతి మ‌సాలా క‌ర్రీ.. బంగాళాదుంప‌లు, మెంతికూర క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ క‌ర్రీని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఒక్క‌సారి ఈ క‌ర్రీని రుచిచూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ మేతి మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ మేతి మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా త‌రిగిన‌ మెంతికూర – పావుకిలో, త‌రిగిన బంగాళాదుంప‌లు – 2( చిన్న‌వి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, బిర్యానీ ఆకులు – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ట‌మాట – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – పావు క‌ప్పు, నీళ్లు – అర క‌ప్పు.

Aloo Methi Masala Curry make in this method
Aloo Methi Masala Curry

ఆలూ మేతి మ‌సాలా కర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి. దీనిని కొద్దిగా వేయించిన త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌ధ్య‌మ‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. బంగాళాదుంప ముక్క‌లు ఉడికిన త‌రువాత ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, పసుపు, గ‌రం మసాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత మెంతికూర వేసి మూత పెట్టి 3 నిమిషాల పాటు మ‌గ్గించాలి. త‌రువాత ఫ్రెష్ క్రీమ్ వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మేతి మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ, రోటీ, నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Tags: Aloo Methi Masala Curry
Previous Post

Healthy Life Style : రోజూ ఈ 10 అల‌వాట్ల‌ను పాటించండి.. ఎలాంటి రోగాలు రావు.. 100 ఏళ్లు జీవిస్తారు..!

Next Post

Blood Thinner Foods : మీ ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.. ఈ 8 ఆహారాల‌ను రోజూ తినండి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.