Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Ashoka Halwa : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన స్వీట్ ఇది.. అంద‌రూ ఇష్టంగా తింటారు.. ఎలా చేయాలంటే..?

D by D
September 18, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Ashoka Halwa : మ‌నం ఇంట్లో వివిధ ర‌కాల తీపి వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో అశోక హ‌ల్వా కూడా ఒక‌టి. పెస‌ర‌ప‌ప్పు, బెల్లం క‌లిపి చేసే ఈ హ‌ల్వా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. ఈ హ‌ల్వాను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం లేదు. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ అశోక హ‌ల్వాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అశోక హ‌ల్వా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెస‌ర‌ప‌ప్పు – అర క‌ప్పు, వేడి నీళ్లు – 2 క‌ప్పులు, బెల్లం తురుము – ఒక క‌ప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – త‌గిన‌న్ని, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, గోధుమ‌పిండి – 2 టేబుల్ స్పూన్స్, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, ప‌చ్చ‌క‌ర్పూరం – చిటికెడు.

Ashoka Halwa recipe in telugu make in this method
Ashoka Halwa

అశోక హ‌ల్వా త‌యారీ విధానం..

ముందుగా పెస‌ర‌ప‌ప్పును నీటిలో వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత వీటిని త‌డిపోయేలా ఆర‌బెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెస‌ర‌ప‌ప్పును క‌ళాయిలో వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. పెస‌ర‌ప‌ప్పు మెత్త‌గా ఉడికి నీరంతా పోయిన త‌రువాత ప‌ప్పు గుత్తితో మెత్త‌గా చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో బెల్లం తురుమును తీసుకుని అర క‌ప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం పూర్తిగా క‌రిగిన త‌రువాత వ‌డ‌క‌ట్టి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో బియ్యంపిండి, గోధుమ పిండి వేసి చిన్న మంట‌పై క‌లుపుతూ వేయించాలి.

దీనిని క‌మ్మ‌టి వాస‌న వ‌చ్చే వ‌రకు వేయించిన త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న పెస‌ర‌ప‌ప్పు వేసి వేయించాలి. దీనిని 10 నుండి 15 నిమిషాల పాటు వేయించిన త‌రువాత బెల్లం నీరు పోసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించిన త‌రువాత యాల‌కుల పొడి, క‌ర్పూరం, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అశోక హ‌ల్వా త‌యార‌వుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు పెస‌ర‌ప‌ప్పుతో అశోక హ‌ల్వాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Ashoka Halwa
Previous Post

Honey And Pepper : తేనె, మిరియాల‌ను క‌లిపి ఈ సీజ‌న్‌లో తీసుకోండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Next Post

Champaran Egg Curry : ఎప్పుడూ చేసే కోడిగుడ్డు కూర కాకుండా.. ఇలా ఒక్క‌సారి వెరైటీగా చేయండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.