Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Bitter Gourd Masala Curry : కాక‌ర‌కాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఒక్క‌సారి టేస్ట్ చేశారంటే.. విడిచిపెట్ట‌రు..

D by D
January 17, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Bitter Gourd Masala Curry : మ‌నం కాక‌ర‌కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు తగ్గ‌డంలో, డ‌యాబెటిస్ ను నియంత్రించ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కాక‌ర‌కాయ‌లు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. చేదుగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. మొద‌టిసారి చేసే వారు ఈ కూర‌ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. కాక‌ర‌కాయ‌ల‌తో రుచిగా మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

కాక‌ర‌కాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స‌న్న‌గా గుండ్ర‌టి ముక్కలుగా త‌రిగిన కాక‌ర‌కాయ‌లు – పావు కిలో, స‌న్న‌గా పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా తరిగిన ట‌మాట – 1, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్.

Bitter Gourd Masala Curry recipe in telugu this the way to cook
Bitter Gourd Masala Curry

మ‌సాలా దినుసులు..

ప‌ల్లీలు – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టేబుల్ స్పూన్, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 2, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీడిప‌ప్పు ప‌లుకులు – 10.

కాక‌ర‌కాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో కాక‌ర కాయ ముక్క‌ల‌ను తీసుకుని అందులో ప‌సుపు, ఉప్పు వేసి కలిపి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత కాక‌ర‌కాయ ముక్క‌ల్లో ఉండే నీరు అంతా పోయేలా చేత్తో పిండుతూ ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నువ్వులు త‌ప్ప మిగిలిన మ‌సాలా ప‌దార్థాలు వేసి వేయించాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. దినుసుల‌న్నీ వేగిన త‌రువాత నువ్వులు వేసి మ‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ దినుసుల‌ను ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ మెత్త‌ని పేస్ట్ లా చేసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కాక‌ర‌కాయ ముక్క‌ల‌ను వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో తాళింపు దినుసులు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి.

త‌రువాత అల్లం పేస్ట్, ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ఈ ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకున్న త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించుకోవాలి. త‌రువాత వేయించిన కాక‌ర‌కాయ ముక్క‌లు, చింత‌పండు ర‌సం, ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాక‌ర‌కాయ మ‌సాలా కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర చేదు లేకుండా ఉంటుంది క‌నుక దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Bitter Gourd Masala Curry
Previous Post

Chinthapandu Karam : చింత‌పండుతో ఎంతో రుచికర‌మైన కారంను ఇలా చేసుకోవ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Next Post

Carrot Oil : ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్నా స‌రే.. దీన్ని రాస్తే త‌గ్గిపోతాయి..

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.