Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Carrot Fry : క్యారెట్ లో కొబ్బరి వేసి రుచిగా ఇలా ఫ్రై చేయండి.. రైస్ లో తింటే సూపర్ గా ఉంటుంది..

D by D
February 17, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Carrot Fry : క్యారెట్ తో మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. క్యారెట్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. క్యారెట్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. క్యారెట్ తో త‌ర‌చూ చేసే వంట‌కాల్లో క్యారెట్ ఫ్రై ఒక‌టి. ఈ క్యారెట్ ఫ్రైను కొబ్బ‌రి తురుము వేసి మ‌నం మ‌రింత రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. కొబ్బ‌రి వేసి చేసే క్యారెట్ ఫ్రై రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. కొబ్బ‌రి తురుము వేసి క్యారెట్ ఫ్రైను రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ కొబ్బ‌రి ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న ముక్క‌లుగా త‌రిగిన క్యారెట్ – అర కిలో, ప‌చ్చి బ‌ఠాణీ – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం – ఒక ఇంచు ముక్క‌, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – 3 టేబుల్ స్పూన్స్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – త‌గినంత‌.

Carrot Fry recipe cook it with coconut tasty with rice
Carrot Fry

క్యారెట్ కొబ్బరి ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా క్యారెట్ ముక్క‌ల‌ను, ప‌చ్చి బ‌ఠాణీని ఆవిరి మీద 10 నిమిషాల పాటు ఉడికించి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత జార్ లో ప‌చ్చికొబ్బ‌రి ముక్క‌లు, అల్లం వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉడికించిన క్యారెట్, బ‌ఠాణీ వేసి 10 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న కొబ్బ‌రి మిశ్ర‌మం, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి ఒక నిమిషం పాటు క‌లుపుతూ వేయించాలి.

త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ కొబ్బ‌రి ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా క్యారెట్ ఫ్రైను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

Tags: Carrot Fry
Previous Post

Kabuli Chana : రోజూ ఇవి ఇన్ని తింటే చాలు.. ర‌క్త‌మే ర‌క్తం.. షుగ‌ర్ త‌గ్గుతుంది..!

Next Post

Pearl Millets : ర‌క్త నాళాల్లోకి కొవ్వును మొత్తం క‌రిగించేస్తాయి ఇవి.. రోజూ తీసుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.