Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Chicken Ka Salan : రెస్టారెంట్ల‌లో ల‌భించే చికెన్ కా సాలాన్‌.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..!

D by D
November 23, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Chicken Ka Salan : చికెన్ కా సాల‌న్.. చికెన్ తో చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చింత‌పండు పులుసు వేసి చేసే ఈ క‌ర్రీ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. త‌రుచూ చికెన్ తో చేసే వంట‌కాల‌తో పాటు దీనిని కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, పుల్ల పుల్ల‌గా ఉండే ఈ చికెన్ కా సాల‌న్ కర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ కా సాల‌న్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

ప‌ల్లీలు – పావు క‌ప్పు, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బ‌రి పొడి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – పావు క‌ప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, పొడుగ్గా స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – పావు క‌ప్పు, అర‌గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ – అర కిలో, చింత‌పండు పులుసు – అర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Chicken Ka Salan recipe in telugu make in this method
Chicken Ka Salan

చికెన్ కా సాల‌న్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. త‌రువాత ధ‌నియాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత నువ్వులు, ఎండు కొబ్బ‌రి పొడి వేసి వేయించాలి. ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి.

దీనిని 4 నిమిషాల పాటు వేయించిన త‌రువాత పావు లీటర్ నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత చింత‌పండు పులుసు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మంట‌ను చిన్న‌గా చేసి చికెన్ ను ఉడికించాలి. చికెన్ మెత్త‌గా ఉడికి నూనె పైకితేలిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ కా సాల‌న్ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసిన ఈ కర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Chicken Ka Salan
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Barley Water For Kidney Stones : ఖాళీ కడుపుతో బార్లీ జావ తాగండి, షుగర్, బీపీ, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లలాంటి సమస్యలకు చెక్ పెట్టండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.