Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Chicken Manchurian : ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే చికెన్ మంచూరియాను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

D by D
January 31, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Chicken Manchurian : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో చికెన్ మంచూరియా ఒక‌టి. చికెన్ తో చేసుకోద‌గిన వివిధ ర‌కాల వంట‌కాల్లో ఇది ఒక‌టి. చికెన్ మంచూరియా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా అదే రుచితో ఈ చికెన్ మంచూరియాను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, చాలా తేలిక‌గా అయ్యేలా ఈ చికెన్ మంచూరియాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ మంచూరియా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

బోన్ లెప్ చికెన్ క్యూబ్స్ – 300 గ్రా., కోడిగుడ్డు – ఒక‌టి, మైదా – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – రెండు చిటికెలు, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా, వెల్లుల్లి త‌రుగు – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, లైట్ సోయా సాస్ – ఒక టీ స్పూన్, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, న‌ల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, చైనీస్ చిల్లీ పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – పావు క‌ప్పు, త‌రిగిన స్ప్రింగ్ ఆనియ‌న్స్ – 2 టేబుల్ స్పూన్స్.

Chicken Manchurian recipe in telugu make in this way
Chicken Manchurian

చికెన్ మంచూరియా త‌యారీ విధానం..

ముందుగా ఒక గంట పాటు చికెన్ ముక్క‌ల‌ను ఉప్పు నీటిలో వేసి నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని నీళ్లు లేకుండా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో చిటికెడు ఉప్పు, మైదాపిండి, కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల నీళ్ల పోసి పిండి ముక్క‌ల‌కు ప‌ట్టేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చికెన్ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై లైట్ గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక అల్లం తరుగు, ప‌చ్చిమిర్చి త‌రుగు, వెల్లుల్లి త‌రుగు వేసి పెద్ద మంటపై వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ త‌రుగు వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత నీళ్లు, స్ప్రింగ్ ఆనియ‌న్స్ త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి నూనె పైకి తేలే వ‌ర‌కు పెద్ద మంట‌పై ఉడికించాలి. త‌రువాత వేయించిన చికెన్ ను వేసి క‌ల‌పాలి. సాసెస్ అన్నీ ముక్క‌ల‌కు పట్టేలా పెద్ద మంట‌పై కలుపుతూ వేయించాలి. చివ‌ర‌గా స్ప్రింగ్ ఆనియ‌న్స్ ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ మంచూరియా త‌యార‌వుతుంది. బ‌య‌ట రెస్టారెంట్ ల‌కు, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌కు వెళ్లే ప‌ని లేకుండా ఇలా చికెన్ మంచూరియాను ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా చికెన్ మంచూరియాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Chicken Manchurian
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Ragulu : వీటిని తీసుకుంటే చాలు.. ట‌న్నుల కొద్దీ బ‌లం వ‌స్తుంది.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.