Chikkudukaya Kobbari Karam : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో చిక్కుడుకాయలు కూడా ఒకటి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి అవరమయ్యే ఎన్నో పోషకాలు వీటిలో ఉంటాయి. వీటిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. చిక్కుడుకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. చిక్కుడుకాయలతో ఎక్కువగా చేసే కూరల్లో చిక్కుడుకాయ వేపుడు కూడా ఒకటి. చిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ వేపుడును మనం కొబ్బరి కారం వేసి మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరికారం వేసి చేసే చిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరికారం వేసి చిక్కుడుకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడు కాయ కొబ్బరి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కడు కాయలు – పావు కిలో, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 5, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
చిక్కుడు కాయ కొబ్బరి కారం తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే చిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని పది నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు, పసుపు, కారం, పచ్చి కొబ్బరి తురుము వేసి మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ కొబ్బరి కారం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే చిక్కుడు కాయ వేపుడు కంటే ఇలా కొబ్బరి కారం వేసి చేసే చిక్కుడు కాయ వేపుడు మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన చిక్కుడుకాయ వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.