Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Dosakaya Pappu : దోస‌కాయ ప‌ప్పును ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

D by D
January 22, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dosakaya Pappu : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల ప‌ప్పు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం తయారు చేయ‌డానికి వీలుగా ఉండే ప‌ప్పు కూర‌ల్లో దోస‌కాయ ప‌ప్పు కూడా ఒక‌టి. దోస‌కాయ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. బ్యాచిలర్స్, వంట‌రాని వారు కూడా ఈ ప‌ప్పును సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దోస‌కాయ ప‌ప్పును రుచిగా, సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దోస‌కాయ ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – 150 గ్రా., త‌రిగిన దోస‌కాయ‌లు – పావుకిలో, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ట‌మాటాలు – 2, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నూనె – ఒక టేబుల్ స్పూన్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Dosakaya Pappu recipe in telugu this is the way to make it
Dosakaya Pappu

దోస‌కాయ ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పు వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఇందులో దోస‌కాయ ముక్క‌లు, ప‌సుపు, ట‌మాట ముక్క‌లు, ఒక గ్లాస్ నీళ్లు, ఒక టీ స్పూన్ నూనె పోసి మూత పెట్టాలి. ఈ ప‌ప్పును 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఇందులో చింత‌పండు ర‌సం, ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత ముందుగా ఉడికించుకున్న ప‌ప్పును వేసి క‌ల‌పాలి.

దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే దోస‌కాయ ప‌ప్పు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. లొట్ట‌లేసుకుంటూ ఇంట్లో అంద‌రూ ఈ ప‌ప్పును ఇష్టంగా తింటారు. దోస‌కాయ‌తో ఈ విధంగా ప‌ప్పును త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

Tags: Dosakaya Pappu
Previous Post

Beans Fry : బీన్స్ అంటే ఇష్టం లేదా.. అయితే ఇలా ఫ్రై చేయండి.. ఎంతో ఇష్టంగా తింటారు..

Next Post

Home Made Coconut Oil : కొబ్బ‌రినూనెను ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.