Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Egg Karam Rice : ఎగ్ కారం రైస్‌ను ఇలా చేయండి.. ఎవ‌రైనా స‌రే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

D by D
January 1, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Egg Karam Rice : కోడిగుడ్ల‌తో చేసే వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నం మిగిలిన‌ప్పుడు, వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, లంచ్ బాక్స్ లోకి ఈ ఫ్రైడ్ రైస్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ ఎగ్ ప్రైడ్ రైస్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మ‌రింత రుచిగా, సుల‌భంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ ఫ్రైడ్ రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

అన్నం – ఒక గ్లాస్ బియ్యంతో వండినంత‌, కారం – ఒకటిన్న‌ర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ట‌మాట ముక్క‌లు – అర క‌ప్పు, ప‌సుపు – పావు టీ స్పూన్, కోడిగుడ్లు – 3, మిరియాల పొడి – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Egg Karam Rice recipe in telugu make like this
Egg Karam Rice

ఎగ్ ఫ్రైడ్ రైస్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో అన్నాన్ని తీసుకోవాలి.త‌రువాత ఇందులో ఉప్పు, కారం, ధ‌నియాల పొడి వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు వేగిన త‌రువాత వీటిని క‌ళాయిలోనే ఒక్క ప‌క్కకు అనాలి. త‌రువాత మిగిలిన క‌ళాయిలో మ‌రో టీ స్పూన్ నూనె వేసుకోవాలి. త‌రువాత కోడిగుడ్లు వేసుకోవాలి. వీటిపై కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చ‌ల్లుకోవాలి.

గుడ్లు వేగిన త‌రువాత వీటిని పెద్ద ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత గుడ్డు, ట‌మాట ముక్క‌లు అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత అన్నం వేసి క‌ల‌పాలి. దీనిని పెద్ద మంట‌పై అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత నిమ్మ‌ర‌సం, కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా చాలా సుల‌భంగా చాలా రుచిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Tags: Egg Karam Rice
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Sugar : చ‌క్కెర వాడాల్సిన ప‌నిలేదు.. తియ్య‌గా ఉండేందుకు వీటిని కూడా వాడ‌వ‌చ్చు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.