Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Ginger Chicken : రెస్టారెంట్ల‌లో ల‌భించే జింజ‌ర్ చికెన్‌.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

D by D
November 7, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Ginger Chicken : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌ల్లో జింజ‌ర్ చికెన్ కూడా ఒక‌టి. జింజ‌ర్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. స్టాట‌ర్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. ఈ జింజ‌ర్ చికెన్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా వెరైటీగా జింజ‌ర్ చికెన్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ జింజ‌ర్ చికెన్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

జింజ‌ర్ చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అర‌గంట‌పాట ఉప్పు నీటిలో నాన‌బెట్టిన బోన్ లెస్ చికెన్ – 300 గ్రా., కోడిగుడ్డు – 1, ఉప్పు – కొద్దిగా, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా, చిన్న‌గా త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు – 6, త‌రిగిన అల్లం – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, ఉల్లిపాయ త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, చిల్లీ పేస్ట్ – 2 టీ స్పూన్స్, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, ట‌మాట కిచ‌ప్ – ఒక టేబుల్ స్పూన్, లైట్ సోయా సాస్ – ఒక టీ స్పూన్, బ్లాక్ పెప్ప‌ర్ పౌడ‌ర్ – అర టీ స్పూన్, వైట్ పెప్ప‌ర్ పౌడ‌ర్ – అర టీ స్పూన్, ఆరోమెటిక్ పౌడ‌ర్ – అర టీ స్పూన్, పంచ‌దార – అర టీ స్పూన్, నీళ్లు – 250 ఎమ్ ఎల్.

Ginger Chicken recipe in telugu make it in restaurant style
Ginger Chicken

జింజ‌ర్ చికెన్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నాన‌బెట్టిన చికెన్ ను నీళ్లు లేకుండా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, మైదాపిండి, కార్న్ ఫ్లోర్ ను వేసుకోవాలి. త‌రువాత కోడిగుడ్డును బాగా క‌ల‌పాలి. త‌రువాత 2 టేబుల్ స్పూన్ల కోడిగుడ్డును చికెన్ లో వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడ‌య్యాక చికెన్ ను వేసి వేయించాలి. దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత వెల్లుల్లి త‌రుగు, అల్లం త‌రుగు, ప‌చ్చిమిర్చి త‌రుగు, ఉల్లిపాయ త‌రుగు వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత చిల్లీ పేస్ట్, వెనిగ‌ర్, ట‌మాట కిచ‌ప్, లైట్ సోయా సాస్, బ్లాక్ పెప్ప‌ర్ పౌడ‌ర్, వైట్ పెప్ప‌ర్ పౌడ‌ర్, అరోమేటిక్ పౌడ‌ర్ వేసి క‌ల‌పాలి. వీటిని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించిన త‌రువాత ఉప్పు, పంచ‌దార వేసి క‌ల‌పాలి.

త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. నీళ్లు మ‌రిగి చిక్క‌బడిన త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. త‌రువాత మ‌రింత అల్లం తరుగు వేసి క‌ల‌పాలి. మ‌సాలాల‌న్ని చికెన్ కు ప‌ట్టిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వేడి వేడిగా స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జింజ‌ర్ చికెన్ త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా జింజ‌ర్ చికెన్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Tags: Ginger Chicken
Previous Post

Sleeplessness : నిద్ర మ‌ధ్య‌లో మెళ‌కువ వ‌చ్చి మ‌ళ్లీ నిద్ర ప‌ట్ట‌డం లేదా.. అయితే ఇలా చేయండి..!

Next Post

Mixed Veg Paratha : మిక్స్‌డ్ వెజిట‌బుల్ ప‌రాటాల‌ను ఇలా చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతాయి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.