food

పోషకాల ‘పాలక్ పన్నీర్’ కర్రీ ఎలా చేసుకోవాలి అంటే ..!

ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. వారంలో కనీసం రెండు సార్లు అయినా ఆకుకూరలు తినమని డాక్టర్లు చెపుతూ ఉంటారు. కాని ఆకుకూరలు అనగానే ఆకుకూర పప్పు లేదా వేపుడు చేసుకుంటాం. కొంచెం వెరైటీ గా అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తే అన్ని రకాల పోషక విలువలు అందుతాయి.

పాలక్ పన్నీర్ కర్రీ కి కావలసిన పదార్థాలు:

2 కప్పుల పాలకూర, 2 కప్పుల పన్నీర్, ½ కప్పు టమాటో పేస్ట్, 1 కప్పు ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి, 25 గ్రాముల బటర్, 1 ½ టీ స్పూన్ అల్లం,వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సోంపు, 2 యాలకులు, జీడి పప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, చిటికెడు పంచదార, 1 టి స్పూన్ కారం, ఉప్పు, ¼ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, ¼ కప్పు నీళ్ళు, 2 స్పూన్ల క్రీమ్ పాలకూర ని శుభ్రం చేసుకుని మిక్సి జార్లో పచ్చి మిర్చి, పాలకూర వేసి ప్యురీ సిద్దం చేసుకోవాలి. పన్నీర్ ని ముక్కలు గా కట్ చేసి వేడినీటిలో నాన పెట్టాలి. సోంపు యాలకుల‌ పొడి రెడీ చేసుకోవాలి.

how to make palak paneer curry recipe in telugu

తయారి విధానం :

స్టవ్ వెలిగించి కడాయి పెట్టి బటర్ వేసి జీడి పప్పు దోరగా వేయించి పక్కన పెట్టాలి. దానిలో జీలకర్ర, చెక్క, లవంగాలు వేసి వేగాక ఉల్లిపాయ తరుగు, ఉప్పు వేసి మెత్తబడేవరకు వేగనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ , టమాటో పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. తరువాత పన్నీర్ ముక్కలు, పాలకూర ప్యురీ, పసుపు, కారం, గరం మసాల, సోంపు మరియు యాలకుల పొడి వేసి బాగా కలపాలి. నీళ్ళు పోసి మూడు నిమిషాలు సన్న మంట మీద ఉడికించాలి. అంతే వేడి వేడి పాలక్ పన్నీర్ కూర రెడీ.

Admin

Recent Posts