Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Kadai Paneer : రెస్టారెంట్ల‌లో ల‌భించే క‌డై ప‌నీర్‌.. ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు..!

D by D
December 24, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Kadai Paneer : మ‌నం ప‌నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌నీర్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌నీర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క‌డాయి ప‌నీర్ కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో, ధాబాల‌ల్లో ల‌భిస్తుంది. క‌డాయి ప‌నీర్ చాలా రుచిగా ఉంటుంది. నాన్, రోటీ, పూరీ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ క‌డాయి పనీర్ ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే క‌డాయి ప‌నీర్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌డాయి ప‌నీర్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – అర క‌ప్పు, ఎండుమిర్చి – 3, జీలక‌ర్ర – ఒక టీ స్పూన్, దంచిన ధ‌నియాలు – ఒక టీ స్పూన్, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, క్యూబ్స్ లాగా తరిగిన ఉల్లిపాయ – 1, క్యూబ్స్ లాగా త‌రిగిన క్యాప్సికం – 1, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ట‌మాటాలు – 2, నీళ్లు – పావు క‌ప్పు, త‌రిగిన పెద్ద ట‌మాట – 1, ప‌నీర్ – 200 గ్రా., నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.

Kadai Paneer you can make this easily at home
Kadai Paneer

క‌డాయి ప‌నీర్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఎండుమిర్చి, జీల‌క‌ర్ర, ధ‌నియాలు, సోంపు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత క్యూబ్స్ లాగా త‌రిగిన ఉల్లిపాయ‌, క్యాప్సికం వేసి వేయించాలి. త‌రువాత ధ‌నియాల పొడి, ప‌సుపు, ఉప్పు, గ‌రం మ‌సాలా, కారం, జీల‌క‌ర్ర పొడి వేసి వేయించాలి. త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా మ‌గ్గిన త‌రువాత పీన‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత 100 ఎమ్ ఎల్ నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ప‌నీర్ ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌డాయి ప‌నీర్ త‌యార‌వుతుంది. ఈ విధంగా త‌యారు చేసిన క‌డాయి ప‌నీర్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Kadai Paneer
Previous Post

Madras Kheema Masala : మ‌ద్రాస్ ఖీమా మ‌సాలా.. త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Next Post

Gas Trouble Remedies : ఎలాంటి మెడిసిన్లు అవ‌స‌రం లేదు.. కొన్ని సెక‌న్ల‌లో గ్యాస్ త‌గ్గుతుంది.. ఇలా చేయండి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.