Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Semiya Payasam : సేమియా పాయ‌సాన్ని ఇలా చేస్తే గ‌ట్టి ప‌డ‌కుండా ఉంటుంది.. ఎంతో రుచిగా తిన‌వ‌చ్చు..!

D by D
June 25, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Semiya Payasam : మ‌నం వంటింట్లో అనేక ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో సేమియా పాయ‌సం కూడా ఒక‌టి. సేమియాను కూడా మ‌నం ఆహారంగా తీసుకంటూ ఉంటాం. సేమియాతో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. సేమియాతో చేసే పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది రుచి చూసే ఉంటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. మ‌నం త‌యారు చేసిన సేమియా పాయ‌సం చ‌ల్లారే కొద్దీ గ‌ట్టి ప‌డుతుంది. సేమియా పాయ‌సం చ‌ల్లారిన త‌రువాత కూడా గ‌ట్టి ప‌డ‌కుండా ఉండాలంటే దీనిని ఏ విధంగా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సేమియా పాయ‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

సేమియా – ఒక క‌ప్పు, పాలు – 3 క‌ప్పులు, నీళ్లు – 2 క‌ప్పులు, పంచ‌దార – ఒక క‌ప్పు, కాచి చ‌ల్లార్చిన పాలు – ఒక క‌ప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, బాదం ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు ద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్.

make Semiya Payasam in this way tastes good
Semiya Payasam

సేమియా పాయ‌సం తయారీ విధానం..

ముందుగా అడుగు భాగంలో మందంగా ఉండే ఒక గిన్నెను తీసుకుని అందులో నెయ్యి వేసి నెయ్యి క‌రిగిన త‌రువాత డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే గిన్నెలో సేమియాను వేసి రంగు మారే వ‌ర‌కు వేయించి మ‌రొక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 3 క‌ప్పుల పాలు, 2 క‌ప్పుల నీళ్ల‌ను పోసి పాలు మీగ‌డ క‌ట్ట‌కుండా క‌లుపుతూ మ‌రిగించాలి. పాలు మ‌రిగిన త‌రువాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను వేసి బాగా క‌ల‌పాలి. సేమియా పూర్తిగా ఉడికిన త‌రువాత ఒక క‌ప్పు కాచి చ‌ల్లార్చిన పాల‌ను, యాల‌కుల‌ పొడిని, వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా పాయ‌సం త‌యార‌వుతుంది. సేమియా త‌యారీ చివ‌ర్లో కాచి చ‌ల్లార్చిన పాల‌ను పోయ‌డం వ‌ల్ల సేమియా పాయ‌సం చ‌ల్లారిన త‌రువాత కూడా గ‌ట్టిప‌డ‌కుండా ఉంటుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా చాలా సులువుగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎంతో రుచిగా సేమియా పాయ‌సాన్ని చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Semiya Payasam
Previous Post

Kanakambaram : క‌న‌కాంబ‌రం మొక్క‌లకు పువ్వులు బాగా పూయాలంటే.. ఇలా చేయాలి..!

Next Post

Dosakaya Roti Pachadi : దోస‌కాయ రోటి ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.