Maramarala Laddu : మరమరాలు.. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మరమరాలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. మరమరాలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మరమరాలతో చేసుకోదగిన వంటకాల్లో మరమరాల లడ్డూ కూడా ఒకటి. ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. పూర్వకాలంలో వీటిని ఎక్కువగా తయారు చేసే వారు. మరమరాలు, బెల్లం ఉంటే చాలు వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మరమరాల లడ్డూలను రుచిగా, తేలికగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మరమరాల లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
మరమరాలు – 120 గ్రా., బెల్లం తురుము – 150 గ్రా..
మరమరాల లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో బెల్లం తురుము, ఒక టీ స్పూన్ నీళ్లు పోసి కలుపుతూ వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత మరో మూడు నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. బెల్లం ముదురు పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి మరో అంతా కలుపుకోవాలి. తరువాత ఇందులో మరమరాలను వేసి కలపాలి. మరమరాలు అంతా కలిసిన తరువాత చేతికి తడి చేసుకుంటూ కావల్సిన పరిమాణంలో లడ్డూలను చుట్టుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మరమరాల లడ్డూ తయారవుతుంది. వీటిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా కూడా వీటిని తినవచ్చు.