Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Meal Maker Masala Curry : డిఫ‌రెంట్ స్టైల్‌లో మీల్‌మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

D by D
April 8, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Meal Maker Masala Curry : ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో మీల్ మేక‌ర్ కూడా ఒక‌టి. మీల్ మేక‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటితో మ‌నం ఎన్నో రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. మీల్ మేక‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. అన్నం, చ‌పాతీ, పులావ్, బ‌గారా అన్నం ఇలా దేనితోనైనా ఈ క‌ర్రీని తీసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సుల‌భంగా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా మీల్ మేక‌ర్ తో మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.

మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

మీల్ మేక‌ర్ – అర క‌ప్పు, బ్రౌన్ ఆనియ‌న్స్ – ఒక క‌ప్పు, నాన‌బెట్టిన జీడిపప్పు – 8, నాన‌బెట్టిన బాదంప‌ప్పు – 8, త‌రిగిన ట‌మాట – 1, నూనె – 3 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, బిర్యానీ ఆకు – 1, ల‌వంగాలు – 3, యాల‌కులు – 3, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన పుదీనా – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, ఉప్పు – త‌గినంత‌, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Meal Maker Masala Curry make it in different style
Meal Maker Masala Curry

మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా మీల్ మేక‌ర్ ల‌ను వేడి నీటిలో వేసి 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిలో ఉండే నీటిని పిండేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత జార్ లో బ్రౌన్ ఆనియ‌న్స్, జీడిప‌ప్పు, పొట్టు తీసిన‌ బాదంప‌ప్పు, ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మీల్ మేక‌ర్ లను వేసి కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని అదే నూనెలో మ‌సాలా దినుసులు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, పుదీనా వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి.

దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత వేయించిన మీల్ మేక‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు త‌గినంత వేసి కలిపి మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మూత తీసి పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిపై మ‌ర‌లా మూత పెట్టి కూర చిక్క‌బ‌డి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. కూర చ‌క్క‌గా ఉడికిన త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్త‌మీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అన్నం, చ‌పాతీ వంట వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది.

Tags: Meal Maker Masala Curry
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Tomato Pulao : ట‌మాటా పులావ్‌ను ఎంతో టేస్టీగా ఇలా చేయండి.. ముద్ద కూడా మిగ‌ల్చ‌కుండా మొత్తం తినేస్తారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.