Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Millets Dosa : పూర్వీకుల నాటి దృఢ‌మైన శ‌రీరం కోసం.. మిల్లెట్స్ దోశ‌.. త‌యారీ ఇలా..!

D by D
February 7, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Millets Dosa : మ‌నం రాగులు, జొన్న‌లు, కొర్ర‌లు, సామ‌లు వంటి వివిధ ర‌కాల చిరు ధాన్యాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చిరు ధాన్యాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌ను తెలిసిందే. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ర‌క్తహీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, కండ‌రాల‌ను ధృడంగా ఉంచ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఈ చిరు ధాన్యాలు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ చిరు ధాన్యాల‌తో అన్నం, సంగ‌టి, జావ వంటి వాటినే కాకుండా వీటితో మం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చిరు ధాన్యాల‌న్నింటిని క‌లిపి రుచిగా దోశ‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మిల్లెట్ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

మిన‌ప‌ప్పు – ఒక క‌ప్పు, రాగులు – అర క‌ప్పు, సామ‌లు – అర క‌ప్పు, జొన్న‌లు – అర క‌ప్పు, కొర్ర‌లు – అర క‌ప్పు, అటుకులు – అర క‌ప్పు, మెంతులు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

Millets Dosa recipe very healthy easy to make
Millets Dosa

మిల్లెట్ దోశ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మిన‌ప‌ప్పును తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌డ‌గాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసి 6 నుండి 8 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని జార్ లో లేదా గ్రైండ‌ర్ లో వేసి త‌గిన‌న్ని పోస్తూ మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి 10 గంట‌ల పాటు పులియ‌బెట్టుకోవాలి. పిండి చ‌క్క‌గా పులిసిన త‌రువాత త‌గినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు, త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌లపాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి.

పెనం వేడ‌య్యాక నూనె వేసి టిష్యూ పేప‌ర్ తో తుడుచుకోవాలి. త‌రువాత పిండిని వేసి దోశ‌లా రుద్దుకోవాలి. దోశ కొద్దిగా కాలిన త‌రువాత నూనె వేస్తూ చిన్న మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మిల్లెట్ దోశ‌లు త‌యార‌వుతాయి. వీటిని ఏ చట్నీతో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. సాధార‌ణ దోశ‌లే కాకుండా ఈ పిండితో మ‌సాలా దోశ‌, ఉల్లిదోశ వంటి వాటిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. షుట‌ర్ వ్యాధి గ్ర‌స్తులు, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ విధంగా చిరు ధాన్యాల‌తో దోశ‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

Tags: Millets Dosa
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Almonds With Milk : రాత్రిపూట 4 బాదంప‌ప్పుల‌ను తిని వేడి పాలు తాగండి.. ఏం జ‌రుగుతుందో చెబితే న‌మ్మ‌లేరు..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.