Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Potlakaya Podi Pappu : పొట్ల‌కాయ‌లు అంటే ఇష్టం లేదా.. ఇలా వండితే ఎవ‌రైనా స‌రే లాగించేస్తారు..

D by D
January 24, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Potlakaya Podi Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో పొట్ల‌కాయ కూడా ఒక‌టి. కానీ చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె పొట్ల‌కాయ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, మూత్ర‌పిండాల్లో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో ఇలా అనేక విధాలుగా పొట్ల‌కాయ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. పొట్ల‌కాయ‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో పొట్ల‌కాయ పొడిప‌ప్పు కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. రుచిగా, సుల‌భంగా పొట్ల‌కాయ‌తో పొడి ప‌ప్పు కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పొట్ల‌కాయ పొడి ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నాన‌బెట్టిన కందిప‌ప్పు – ఒక‌టిన్న‌ర టీ గ్లాస్, ప‌సుపు – అర టీ స్పూన్, త‌రిగిన పొట్ల‌కాయ – 1, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్.

Potlakaya Podi Pappu recipe in telugu make in this method
Potlakaya Podi Pappu

పొట్ల‌కాయ పొడిప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు, ప‌సుపు వేసి ప‌ప్పును మెత్త‌గా ఉడికించాలి. త‌రువాత ప‌ప్పులో ఉండే నీటిని వ‌డ‌క‌ట్టి ప‌ప్పును ప‌క్క‌కు ఉంచాలి. అదే విధంగా పొట్ల‌కాయ‌ల‌ను కూడా ఉడికించి వ‌డ‌క‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌కర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, కొద్దిగా ప‌సుపు వేసి క‌ల‌పాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత ఉడికించిన పొట్ల‌కాయ ముక్క‌ల‌ను వేసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత ఉడికించిన ప‌ప్పు వేసి క‌లపాలి. త‌డి పోయే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి.

దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పొట్ల‌కాయ పొడిప‌ప్పు కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పొట్ల‌కాయ‌ను తిన‌ని వారు కూడా ఈ కూర‌ను ఇష్టంగా తింటారు. ఈ విధంగా పొట్ల‌కాయ‌ల‌తో కూర‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

Tags: Potlakaya Podi Pappu
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Gangavalli Kura Pappu : గంగ‌వ‌ల్లి ఆకుల‌తో ప‌ప్పును ఇలా వండాలి.. ఒక్క ముద్ద పెట్టుకుంటే ఆహా అంటారు..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.