Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Ragi Peanut Laddu : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ల‌డ్డూ ఇది.. ఇలా చేయాలి.. రోజూ ఒక్క‌టి తింటే చాలు..!

D by D
March 15, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Ragi Peanut Laddu : రాగులు.. మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇది ఒకటి. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగుల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. రాగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరానికి బ‌లాన్ని చేకూర్చ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ర‌క్త‌పోటును అలాగే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక విధాలుగా రాగులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ రాగుల‌తో మ‌నం సంగ‌టి, జావ‌, రొట్టె వంటి వాటిని త‌యారు చేస్తాము. ఇవే కాకుండా రాగుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే రాగి ల‌డ్డునూ కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రాగి ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. రాగుల‌తో ఎంతో రుచిగా ఉండే ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి ల‌డ్డు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రాగిపిండి – ఒక క‌ప్పు, వేయించి పొట్టు తీసిన ప‌ల్లీలు – ఒక క‌ప్పు, వేయించిన బాదం ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము – ఒక క‌ప్పు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్.

Ragi Peanut Laddu very healthy make like this eat daily one
Ragi Peanut Laddu

రాగి ల‌డ్డు త‌యారీ విధానం..

ముందుగా రాగిపిండిని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోస్తూ పిండిని చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిని రొట్టెలాగా వ‌త్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక పెనంపై నూనె వేసుకోవాలి. త‌రువాత దీనిపై రాగిరొట్టెను వేసి రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. రొట్టె ఆరిన త‌రువాత దీనిని ముక్క‌లుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి. త‌రువాత దీనిని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలో వేసుకోవాలి. త‌రువాత అదేజార్ లో ప‌ల్లీలు, బాదం ప‌ప్పు వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకుని రాగిమిశ్ర‌మంలో వేసి క‌లుపుకోవాలి.

ఇందులోనే బెల్లం తురుము, యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మానంత‌టిని జార్ లో వేసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత దీనిని మ‌రోసారి అంతా క‌లుపుకుని ల‌డ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి ల‌డ్డూలు త‌యార‌వుతాయి. ఈ ల‌డ్డూలు ప‌ది రోజుల వ‌ర‌కు తాజాగా ఉంటాయి. ఈ ల‌డ్డూల‌ను రోజుకు ఒక‌టి లేదా రెండు చొప్పున తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్కగా ఉంటుంది.

Tags: Ragi Peanut Laddu
Previous Post

Cardamom And Cloves : రోజూ రెండు యాల‌కులు, ఒక ల‌వంగం క‌లిపి ఇలా తినండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Next Post

Ulcer : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అల్స‌ర్ ఉన్న‌ట్లే..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
food

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

by Editor
February 9, 2023

...

Read more
వార్త‌లు

Liver Inflammation : లివ‌ర్ వాపు త‌గ్గాలంటే ఏం చేయాలి.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by D
May 12, 2023

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.