Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Restaurant Style Chicken 65 : రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ 65.. ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

D by D
December 3, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Restaurant Style Chicken 65 : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌ల్లో చికెన్ 65 కూడా ఒక‌టి. చికెన్ 65 చాలా రుచిగా ఉంటుంది. స్టాట‌ర్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ స్టైల్ ఈ చికెన్ 65 ని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా చికెన్ తో వెరైటీగా చికెన్ 65 ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 ని ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ 65 త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా, త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు -10, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, మిరియాల పొడి – ఒక టీ స్పూన్.

Restaurant Style Chicken 65 recipe make in this way
Restaurant Style Chicken 65

మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్ లెస్ చికెన్ – అర‌కిలో, ఉప్పు – త‌గినంత‌, కాశ్మీరి చిల్లీ కారం – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, మిరియాల పొడి – అర టీ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్.

చికెన్ 65 త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత ఈ చికెన్ లో కార్న్ ఫ్లోర్, బియ్యంపిండి వేసి క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చికెన్ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై వేయించాలి. చికెన్ ముక్క‌లు ఎర్ర‌గా, క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత టాసింగ్ కు క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత వెల్లుల్లి త‌రుగు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవ‌న్నీ వేగిన త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. త‌రువాత మిరియాల పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ 65 త‌యార‌వుతుంది. దీనిని ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Restaurant Style Chicken 65
Previous Post

Joint Pains : చ‌లికాలంలో కీళ్ల నొప్పులు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Next Post

Minapattu : మిన‌ప‌ట్టు ఇలా వేసి తినండి.. ఎంతో బాగుంటుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.