food

రైస్ లెస్ చికెన్ బిర్యానీ ఏవిధంగా తయారు చేస్తారు మీకు తెలుసా?

బిర్యాని అనే పేరు వినగానే అందరికీ నోట్లో నీళ్లు ఊరుతాయి. బిర్యానీ అంటేనే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. బిర్యాని ఎన్ని రకాల పద్ధతులు తయారుచేసిన వదలకుండా ఫుల్లుగా లాగించేస్తారు. అయితే బిర్యానీ చేయాలంటే ఇప్పటివరకు మనం బాస్మతి రైస్ ఉపయోగించి చేయడం గురించి విన్నాము. కానీ రైస్ చికెన్ బిర్యాని గురించి బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే ఇక్కడ రైస్ లెస్ బిర్యాని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు:

చికెన్ 300 గ్రాములు, సేమియా ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, మిరియాలు ఒక టేబుల్ స్పూన్, యాలకులు 5, లవంగాలు 4, దాల్చిన చెక్క 1, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు, గరం మసాల, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, బిర్యానీ ఆకులు 4, నల్ల జీలకర్ర అర టీ స్పూన్, పుదీనా చిన్న కట్ట, అనాసపువ్వు ఒకటి, టమోటా ముక్కలు ఒక కప్పు, ధనియాల పొడి అర టీ స్పూన్, కారం పొడి అర టీ స్పూన్, పసుపు చిటికెడు, నీళ్ళు రెండు కప్పులు.

riceless chicken biryani how to make this recipe

తయారీ విధానం:

ముందుగా స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి,దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, సోంపు వేసి దోరగా వేయించాలి. ఇవి చల్లారక అన్ని మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ చేయడం కోసం ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి సేమియాలను బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి. సేమియా పక్కన పెట్టుకొని అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి నూనె వేడి అయిన తరువాత అందులో నల్ల జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, బిర్యానీ ఆకులు, ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చి ,ఉల్లిపాయ, పుదీనా వేసి బాగా వేయించాలి.

ఈ మిశ్రమం మొత్తం బంగారువర్ణంలోకి వచ్చిన తర్వాత అందులో చికెన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాల, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసి ఉన్న టమోటాలను వేసి టమోటా మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియా వేయాలి. సేమియా వేసిన తర్వాత రెండు కప్పుల నీటిని వేసి బాగా ఉడికించాలి. చికెన్, సేమియా ఉడికిందని నిర్ధారించుకొన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత వేడి వేడి రైస్ లెస్ చికెన్ బిర్యాని తయారైపోయింది. కేవలం తక్కువ సమయంలోనే ఎంతో రుచికరమైన బిర్యాని చేయవచ్చు.

Admin

Recent Posts