Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Sanna Karappusa Laddu : స‌న్న కార‌ప్పూస‌తో ల‌డ్డూల‌ను ఇలా చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

D by D
July 11, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Sanna Karappusa Laddu : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల ల‌డ్డూల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ల‌డ్డూల‌ల్లో స‌న్న‌కార‌పూస ల‌డ్డూలు కూడా ఒక‌టి. ఇవి మన‌కు స్వీట్ షాపుల్లో కూడా ల‌భిస్తూ ఉంటాయి. ఈ కార‌పూస ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే కారపూస ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స‌న్న‌కార పూస ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, ఉప్పు – చిటికెడు, నూనె- డీప్ ఫ్రైకు స‌రిప‌డా, బెల్లం తురుము – ఒక క‌ప్పు, నీళ్లు – పావు క‌ప్పు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – ఒక టీ స్పూన్.

Sanna Karappusa Laddu recipe in telugu very tasty easy to make
Sanna Karappusa Laddu

స‌న్న‌కార పూస ల‌డ్డూ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండిని తీసుకుని అందులో ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత మురుకుల గొట్టంలో స‌న్న‌ని రంధ్రాలు ఉండే బిల్ల‌ను ఉంచి దానికి లోప‌ల నూనెను రాసుకోవాలి. త‌రువాత మురుకుల గొట్టంలో పిండిని ఉంచి నూనెలో కార‌పూస‌ వ‌త్తుకోవాలి. ఈ కార‌పూస‌ను రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. కార‌పూస చ‌ల్లారిన త‌రువాత చేత్తో చిన్న చిన్న ముక్క‌లుగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఒక ప్లేట్ కు నెయ్యి రాసి ప‌క్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి క‌ల‌పాలి. బెల్లం క‌రిగిన త‌రువాత దీనిని వ‌డ‌క‌ట్టి తీసుకోవాలి.

ఇప్పుడు ఈ బెల్లాన్ని ఉండ పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. నీటిలో బెల్లం పాకాన్నివేసి ఉండ‌లా చేసి చూడాలి. బెల్లం పాకం ముద్ద‌గా చేయ‌డానికి రాగానే యాల‌కుల పొడి, నెయ్యి వేసి క‌ల‌పాలి. త‌రువాత కార‌పూస‌ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని కొద్దిగా చ‌ల్లారనివ్వాలి. త‌రువాత చేతికి నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా కార‌పూస మిశ్ర‌మాన్ని తీసుకుంటూ ల‌డ్డూలుగా వ‌త్తుకోవాలి. ల‌డ్డూల‌ను చుట్టుకునేట‌ప్పుడు ఎక్కువ ఒత్తిడి ఇవ్వ‌కుండా నెమ్మ‌దిగా వ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే కార‌పూస ల‌డ్డూలు త‌యారవుతాయి. వీటిని గాలి, త‌డి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి.

Tags: Sanna Karappusa Laddu
Previous Post

Foods For High BP : రోజూ వీటిని తింటే చాలు.. హైబీపీ ఎంత ఉన్నా దిగిపోతుంది..!

Next Post

Vankaya Jeedipappu Masala Curry : ఫంక్ష‌న్ల‌లో క్యాట‌రింగ్ వాళ్లు వ‌డ్డించే వంకాయ, జీడిప‌ప్పు కూర‌.. ఇలా చేయాలి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.